యాహూ గ్రూపులు షట్‌డౌన్, డేటా వెంటనే సేవ్ చేసుకోండి

By Gizbot Bureau
|

దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలు అందించిన యాహూ గ్రూపులు ఇప్పుడు మూసివేయబడుతున్నాయి. ఒకప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన యాహూ గ్రూపుల్లో డేటాను కలిగి ఉన్న వినియోగదారులు వాటిని వెంటనే సేవ్ చేసుకోవాలని కంపెనీ కోరింది. సేవ్ చేసుకోవడానికి యూజర్లకు డిసెంబర్ 14 వరకు గడువును ఇచ్చింది. వెరిజోన్ యాజమాన్యంలోని టెక్ కంపెనీ యాహూ గ్రూప్స్ సైట్‌లో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడాన్ని నిలిపివేసింది. డిసెంబర్ 14 నుండి, అన్ని గ్రూపులు ప్రైవేట్‌గా చేయబడతాయి. అలాగే వెబ్‌సైట్ ద్వారా గతంలో అప్‌లోడ్ చేయబడిన కంటెంట్ తీసివేయబడుతుంది.

గోప్యత చాలా కీలకం
 

గోప్యత చాలా కీలకం

గోప్యతతో పాటు మా మొత్తం సూత్రాలతో మెరుగ్గా ఉండటానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. మీరు మీ యాహూ గ్రూపులో పోస్ట్ చేసిన లేదా నిల్వ చేసిన ఏదైనా కంటెంట్‌ను సేవ్ చేసుకోవాలంటే దయచేసి డిసెంబర్ 14 లోగా డౌన్‌లోడ్ చేసుకోండి "అని యాహూ గ్రూప్స్ బృందం వినియోగదారులకు ఇమెయిల్‌లో తెలిపింది. యూజర్లు ఫోటోలు మరియు ఫైళ్ళను యాహూ గ్రూప్స్ సైట్ నుండి సేవ్ చేయవచ్చు లేదా మీరు మీ డేటాను ప్రైవసీ డాష్బోర్డ్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు" అని కంపెనీ తెలిపింది.

18 సంవత్సరాల పాటు

18 సంవత్సరాల పాటు

2001 లో యాహూ గ్రూప్స్ ప్రారంభించినప్పటి నుండి, మిలియన్ల మంది తమ అనుబంధాన్ని కొనసాగించారు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఈ అనుబంధం కొనసాగింది.ఆసక్తి ఉన్నవారి తమ చుట్టూ ఉన్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడింది.

ఇంటర్నెట్ లో చాలా మార్పులు

ఇంటర్నెట్ లో చాలా మార్పులు

అయితే 2001 నుండి ఇంటర్నెట్ లో చాలా మార్పులు వచ్చాయి. మారుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల అవసరాలకు, అలాగే వారి అలవాటును పరిగణనలోకి తీసుకున్న యూజర్లు ఇతర ఫ్లాట్ ఫాం సేవల వైపు మొగ్గు చూపారు, దీంతో యాహూపై యూజర్లకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది.

మెయిల్ యాప్ లో క్రొత్త సంస్కరణ
 

మెయిల్ యాప్ లో క్రొత్త సంస్కరణ

కాగా సెప్టెంబరులో, యాహూ తన మెయిల్ యాప్ లో క్రొత్త సంస్కరణను ఆవిష్కరించింది, ఇది యూజర్లు వారి ఇన్‌బాక్స్‌లను ఉపయోగించే విధానాన్ని కొత్తగా చూపించింది. నేటి లార్జ్ మొబైల్ స్క్రీన్‌లను దృష్టిలో ఉంచుకుని దీన్ని అభివృద్ధి చేయబడింది, ఇది స్క్రీన్ దిగువన ఉన్న కొత్త నావిగేషన్ బార్‌తో సహజమైన వన్-హ్యాండ్ వాడకాన్ని అనుమతిస్తుంది.

కొత్తగా ముందుకు

కొత్తగా ముందుకు

ఇదిలా ఉంటే కొత్త ఫీచర్లను ముందు ముందు ఇంకా ఏర్పాటు చేయవచ్చని యాహూ టీం చెబుతోంది. ప్రస్తుతం ఉన్నదానికి రాబోయే దానికి తేడా ఏంటంటే మీరు ఇంతకు ముందు వెబ్‌సైట్‌లో భాగస్వామ్యం చేసిన మొత్తం కంటెంట్‌ను ఇప్పుడు ఇమెయిల్ ద్వారా పంచుకోవచ్చు. యాహూ గ్రూపుల్లోని కర్టెన్లు స్మార్ట్‌ఫోన్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో కూడా ప్రతిబింబిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Yahoo Groups users have 5 weeks to save their data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X