ఆన్‌లైన్లో డీజిల్, పెట్రోల్?

By: Madhavi Lagishetty

భారతదేశాన్ని పూర్తిస్థాయి డిజిటలైజేషన్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిజిటల్ డ్రైవ్ లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

ఆన్‌లైన్లో డీజిల్, పెట్రోల్?

ఇ-కామర్స్ ఫ్లాట్ ఫాంలో దాని ఇతర ప్రొడక్టులతో పాటు పెట్రోల్ మరియ డీజిల్ విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం చాలామందికి వరం లాంటిది అయినప్పటికీ.. భద్రతా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈమధ్యే ముగిసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో చమురు, ఐటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ టెలికమ్యూనికేషన్స్ తో చమురును కలిపే ప్రణాళికకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. ఏప్రిల్ 21న శ్రీనగర్ లోని ఎంపీల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మంత్రి ఈ ప్రతిపాదనను వెల్లడించారు.

ఇ-కామర్స్ పోర్టల్లో పెట్రోలు, డీజిల్ విక్రయించడం సాంకేతిక పరిజ్ఞానమని, కొనుగోలుదారుల డోర్ స్టేప్స్ కు అందజేయగలమని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియాలో చమురు, గ్యాస్ లీడర్ దీపక్ మూర్ఖర్ చెప్పారు. అన్ లైన్లో ఇంధనం కొనుగోలుకు సంబంధించి ఎన్నో సవాలు, భద్రతా చర్యలు ఉన్నాయి. విక్రయించిన ఇంధనం సరిగ్గా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది.

ఫస్ట్ ఫోన్ ఇదే, రెండు స్క్రీన్లతో Axon M, షాకింగ్ ఫీచర్లు, బడ్జెట్ ధర...

ఇది చాలా సున్నితమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఛానెల్ అత్యవసర ఇంధన అవసరాలకు నిర్వహిస్తుంది. ప్రత్యేకించి ఈ ప్రతిపాదన గ్రామీణ ప్రాంతాల్లో హిట్ అవుతుంది. ఇక్కడ ప్రజలు ఇంధన పంపులను చేరుకోవడానికి చాలా కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

మాజీ ఒఎన్జిసి ఛైర్మన్ మరియు MD R.S ఇంధనంను అన్ లైన్లో విక్రయించాలనే ఉద్దేశ్యంతో పనిచేయగలమని చెప్పారు. కానీ భద్రతా ప్రమాణాలను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. భద్రతాకు సంబంధించిన ఆందోళనలు పూర్తైన తర్వాత...ఇది వాణిజ్యపరంగా స్కేలబుల్ మోడల్ అయ్యే అవకాశం ఉంది.

పెట్రోలు ధర గురించి వారి ఆందోళనలతో ఆన్ లైన్లో విక్రయించబడుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఇంధన ధరలకు అదనంగా కొనుగోలుదారులకు తమ సేవలను అందించడానికి అలాగే సర్వీస్ ఫీజును వసూలు చేస్తారు.

Read more about:
English summary
The Indian government is planning to sell petrol and diesel online in the country and delivery the same to the doorsteps of the buyers.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot