ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో పేరుతో ఓ లైటర్ వర్షన్ యాప్‌ను గూగుల్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నిన్నమొన్నటి ఈ యాప్ బేటా వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ఈ యాప్‌కు సంబంధించి ఫైనల్ వర్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవచ్చు.
తక్కువ ఇంటర్నెట్ కనెక్టువిటీలో సైతం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని స్మార్ట్ ఆఫ్‌లైన్ ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా వీక్షించవచ్చు.
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆ పై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. యాప్ సైజ్ 9.4MBగా ఉంది. యూట్యూబ్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఈ యాప్‌లో ఉంటాయి.
భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు. యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో దోహదపడగలదని గూగుల్ భావిస్తోంది.
2018లో రిలీజ్ కానున్న ఫోన్లు ఇవే!
యూట్యూబ్ గో యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్‌తో ఇప్పుడు లభ్యమవుతోంది. యూట్యూబ్ గో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు విడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.