Whatsappలో స‌రికొత్త ఫీచ‌ర్‌.. ఇక Voice రూపంలోనూ స్టేట‌స్‌ పెట్టొచ్చు!

|

మెటా సంస్థ‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ అప్లికేష‌న్ Whatsapp త‌మ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నిత్యం ఏదో ఒక కొత్త ఫీచ‌ర్ తెచ్చేందుకు ప్ర‌యోగాలు చేస్తోంది. తాజాగా మ‌రో కొత్త ఫీచ‌ర్‌తో వినియోగ‌దారుల‌ను దృష్టిని ఆక‌ర్షించింది. వాయిస్ స్టేట‌స్ అనే ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఇక Whatsapp యూజ‌ర్లు Voice రూపంలో స్టేట‌స్ అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

 
Whatsappలో స‌రికొత్త ఫీచ‌ర్‌.. ఇక Voice రూపంలోనూ స్టేట‌స్‌ పెట్టొచ్చు!

త్వ‌ర‌లోనే Voice స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులోకి:
Whatsapp అప్లికేష‌న్‌లో ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరి 24 గంట‌ల స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఫొటోలు, 30 సెక‌న్ల వీడియోలు, GIF మాత్ర‌మే స్టేట‌స్‌గా పెట్టుకోవ‌డానికి వీలు ఉండేది. ఈ క్ర‌మంలో తాజాగా Voice స్టేట‌స్‌ల‌ను కూడా పెట్టుకునేలా వెసులుబాటు క‌ల్పించేందుకు వాట్సాప్ సంస్థ ప్ర‌యోగాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇందుకు సంబంధించి WABetaInfo నివేదిక Voice స్టేట‌స్‌ల స్క్రీన్‌షాట్‌ల‌ను విడుద‌ల చేసింది. బీటా వెర్షన్‌లో ఇదువ‌ర‌కు ఉన్న స్టేట‌స్ అప్‌లోడ్ ఆప్ష‌న్ల మాదిరే మ‌రో వాయిస్ స్టేట‌స్ ఆప్ష‌న్ కూడా Whatsapp లో యాడ్ అయిన విష‌యాన్ని యూజ‌ర్లు ఆ స్క్రీన్ షాట్ ద్వారా గ‌మ‌నించ‌వ‌చ్చు.

Whatsappలో స‌రికొత్త ఫీచ‌ర్‌.. ఇక Voice రూపంలోనూ స్టేట‌స్‌ పెట్టొచ్చు!

ఈ Voice స్టేట‌స్‌ను ఎలా ఉప‌యోగించాలి:
ప్రస్తుతం, వాయిస్ నోట్స్ వాట్సాప్ స్టేట‌స్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు Whatsapp లో వాయిస్ ను అప్‌లోడ్ చేయ‌డానికి కింద పేర్కొన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అనుస‌రించండి:
* ముందుగా మీరు మీ మొబైల్‌లో Whatsapp బీటా వ‌ర్ష‌న్‌ను క‌లిగి ఉండాలి.
* వాయిస్ స్టేట‌స్ అప్‌లోడ్ చేయ‌డానికి అప్‌డేటెడ్ వాట్సాప్ బీటా వ‌ర్ష‌న‌ను క‌లిగి ఉన్నార‌నేది నిర్దారించుకోవాలి.
* ఇక స్క్రీన్‌షాట్‌లో పేర్కొన్న విధంగా వాయిస్ ఐకాన్ ఉన్న‌ ఆప్ష‌న్ క్లిక్ చేసి.. వాయిస్ రికార్డు చేసి స్టేట‌స్ అప్‌డేట్ చేయ‌వ‌చ్చు. అప్‌లోడ్ చేయ‌డానికి ముందు మీరు ఆ వాయిస్ మ‌ళ్లీ వినే అవ‌కాశం కూడా ఉంటుంది.

Whatsappలో స‌రికొత్త ఫీచ‌ర్‌.. ఇక Voice రూపంలోనూ స్టేట‌స్‌ పెట్టొచ్చు!

ఇప్ప‌టికే మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు అద‌న‌పు ఎమోజీలు:

ఇదే కాకుండా, ఇటీవ‌ల మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్‌కు అద‌నంగా మ‌రిన్ని ఎమోజీల‌ను జ‌త చేస్తున్న‌ట్లు వాట్సాప్ ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెసేజ్ రియాక్ష‌న్ ఫీచ‌ర్లో ఆరు ఎమోజీలు మాత్ర‌మే యూజ‌ర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇక‌నుంచి Message Reactions లో భాగంగా మ‌రిన్ని ఎమోజీల‌ను వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఈ అద‌న‌పు ఎమోజీలకు సంబంధించి ఇదువ‌ర‌కే మెటా వ్య‌వ‌స్థాప‌కులు మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్ల‌డించారు.

యూజ‌ర్లు త‌మ స్నేహితుల‌ నుంచి వ‌చ్చిన మెసేజ్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా రియాక్ష‌న్ ఫీచ‌ర్‌ను క‌నుగొన‌వ‌చ్చు. ఇందులో భాగంగా మునుపటి ఆరు ఎమోజీలతో పాటు "+" గుర్తుతో మెనూ ఓపెన్ అవుతుంది. (+) గుర్తును క్లిక్ చేయ‌డం ద్వారా స్మైలీ, ఎమోష‌న‌ల్ స‌హా ప‌లు కొత్త ఎమోజీలను కలిగి ఉన్న మెనూ ఓపెన్ అవుతుంది. ఇప్ప‌టికే ఇది ప‌లు డివైజ్‌ల‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇది మీ వాట్సాప్‌లో ఇంకా కనిపించకుంటే, రాబోయే కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి వ‌స్తుంది.

 
Whatsappలో స‌రికొత్త ఫీచ‌ర్‌.. ఇక Voice రూపంలోనూ స్టేట‌స్‌ పెట్టొచ్చు!

వాట్సాప్ యూజ‌ర్ల‌కు సీఈవో కీల‌క సూచ‌న‌లు:
వాట్సాప్‌కు సంబంధించి న‌కిలీ యాప్‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ ఆ కంపెనీ సీఈవో విల్ క్యాత్‌కార్ట్ ఇటీవ‌ల కీల‌క సూచ‌న‌లు చేశారు. " కంపెనీకి చెందిన సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ వాట్సాప్ తరహాలో సేవలను అందిస్తున్నట్లు చెప్పుకునే కొన్ని మాల్వేర్ల‌ను (Malwares) క‌లిగిన‌ ప్ర‌మాద‌క‌ర‌మైన‌ యాప్‌లను కనుగొంది. స‌ద‌రు న‌కిలీ అప్లికేష‌న్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా బ‌య‌ట క‌నిపిస్తాయి. "HeyMods" అనే డెవలపర్ నుండి "Hey WhatsApp" మరియు ఇతర పేర్ల‌తో ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన యాప్ లు ఉన్నాయి. అలాంటి వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి." అని విల్ త‌న ట్వీట్‌లో చెప్పాడు. "ఈ న‌కిలీ మాల్వేర్ యాప్స్ యూజ‌ర్ల‌కు ప‌లు స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను క‌ల్పించే విధంగా న‌మ్మ‌కం క‌ల్పిస్తాయి. అది న‌మ్మి యూజ‌ర్లు ఒక‌సారి వాటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఇక వారి వ్య‌క్తిగ‌త డేటా స్కామ‌ర్ల చేతిలో ప్రమాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. అలాంటి ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన అప్లికేష‌న్ల‌ను మేం క‌నుగొన్నాం. వాటిని ఇప్ప‌టికే గూగుల్‌తో పంచుకున్నాం. ఈ విష‌య‌మై గూగుల్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నాం" అని విల్ వెల్ల‌డించారు.

Best Mobiles in India

English summary
You Can Soon Put Voice Status On WhatsApp: How To Use Audio Status Feature On WhatsApp?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X