మీకు నచ్చిన పోస్టును ఫేస్‌బుక్ నుంచే వాట్సాప్‌లోకి షేర్ చేసుకోవచ్చు!

|

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మొబైల్ వెర్షన్ యాప్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ కంటెంట్‌ను వాట్సాప్‌లో షేర్ చేసుకునే వీలుంటుందట. ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించి ఫేస్‌బుక్ ఇంకా వాట్సాప్‌ల నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ వెలువడనప్పటికి కొందరు బేటా యూజర్లు మాత్రం ఇప్పటికే ఈ ఫీచర్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 
మీకు నచ్చిన పోస్టును ఫేస్‌బుక్ నుంచే వాట్సాప్‌లోకి షేర్ చేసుకోవచ్చు!
Send in WhatsApp పేరుతో కొత్త ఆప్షన్...
ఈ కొత్త ఫీచర్‌తో అప్‌డేట్ అయిన ఫేస్‌బుక్ యాప్‌లలో షేర్ బటన్ పై టాప్ చేసిన వెంటనే 'Share Now', 'Write Post', 'Send in WhatsApp' పేర్లతో మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో 'Send in WhatsApp' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీకు కావల్సిన ఇమేజ్ లేదా వీడియో కంటెంట్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేసుకునే వీలుంటుంది.

అచ్చం వాట్సాప్ షేర్ బటన్‌లానే ఉంటుంది..
'Send in WhatsApp' ఫీచర్ అనేది ఇప్పుడు అన్ని వెబ్‌సైట్‌లలో కనిపిస్తోన్న వాట్సాప్ షేర్ బటన్ తరహాలోనే ఉంటుంది. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగకరంగా నిలిచే అవకాశముందని ఫేస్ బుక్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. మొబైల్ కాలింగ్ ఇంకా టెక్స్ట్ంగ్‌లతో పోలిస్తే వాట్సాప్ కమ్యూనికేషన్ కాస్తంత భిన్నంగా ఉంటుంది. వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత ప్రొఫెషనల్‌గా వాడుకునేందుకు పది ఉపయోగకరమైన సలహాలను మీకు అందించటం జరుగుతోంది.

ఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్,రోజుకు 3జిబి డేటాఎయిర్‌టెల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్,రోజుకు 3జిబి డేటా

ప్రొఫెషనల్‌గా వాడుకునేందుకు తీరైన మార్గాలు..
ముఖ్యమైన వ్యక్తులు పంపే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వటం మరవండి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించాల్సిన అవసరం లేదు. మీరు బిజీగా ఉన్నట్లయితే "టాక్ టు యు లేటర్"అని సున్నితంగా తిరస్కరించండి. వాట్సాప్‌లో ఫోటోలు షేర్ చేయటమనేది మంచి అలవాటే. అయితే, అవసరమైన ఫోటోలను మాత్రమే షేర్ చేయటం మంచిది. ఖాళీగా ఉన్నాం కదా అని మెసేజ్‌లు మీద మెసేజ్‌లు పోస్ట్ చేసేయకండి. ఇది ఇతరులకు చికాకు కలిగించవచ్చు. మీ ప్రొఫైల్ ఫోటో మీ మిత్రులకు మాత్రమే కనిపించే విధంగా సెట్టింగ్స్ మార్చుకోండి. తెలియని వ్యక్తులతో గ్రూప్ చాటింగ్ మంచిది కాదు. రిప్లైల కోసం ఎదరుచూస్తు మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి.

Best Mobiles in India

English summary
Facebook is reportedly testing a new feature for mobile app which could enable Facebook’s content to be shared on WhatsApp.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X