మీకు ఉపయోగపడే గూగుల్ మ్యాప్స్ టిప్స్ అండ్ ట్రిక్స్

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది.

|

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్‌గా మారిపోయింది. ఈ నేవిగేషన్ సర్వీస్ సహాయంతో కొత్తకొత్త ప్రాంతాలకు సైతం అలవోకుగా రీచ్ కాగలుగుతున్నాం. గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. నిరంతరం కొత్త ఫీచర్లతో గూగుల్ అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ఈ శీర్షికలో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మీకు ఉపయోగపడే టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

రూ.3999కే LCD టీవి, సవాల్ విసిరిన దేశీయ దిగ్గజంరూ.3999కే LCD టీవి, సవాల్ విసిరిన దేశీయ దిగ్గజం

Commute ట్యాబ్

Commute ట్యాబ్

గూగుల్ లేటెస్ట్ గా Commute అనే ఫీచర్ ను గూగుల్ మ్యాప్స్ యొక్క హోమ్ స్క్రీన్ పై యాడ్ చేసింది.ఈ ఫీచర్ మీకు ఫాస్టెస్ట్ రూట్ ను కనుగొనడానికి సహాయపడుతుంది.అలాగే ఆల్టర్నేట్ రూట్ ను కనుగోడు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

ఈ Commute ట్యాబ్ ను ఎలా ఉపయోగించాలంటే...

- గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- స్క్రీన్ దిగువ కుడివైపున Commute ట్యాబ్ ను నొక్కండి.
- Commute సెట్టింగ్స్ ను నొక్కండి
- మీ హోమ్ మరియు వర్క్ అడ్రస్ ను ఎంటర్ చేయండి
- మీరు ఎలా Commute చేస్తారో ఎంచుకోండి
- మీ Commute టైమ్ ను సెట్ చేయండి
- "Get commute notifications" ను టర్న్ ఆన్ చేసుకోండి

 

See live events that are happening nearby

See live events that are happening nearby

మీరు ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు బోర్ కొడ్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫీచర్ ద్వారా చుట్టూ పక్కల జరిగే లైవ్ ఈవెంట్స్ ను వెతుకవచ్చు.

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

- మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- స్క్రీన్ దిగువ "Explore Nearby" అనే ఆప్షన్ ఉంటుంది అందులో పసుపు కలర్ లో "Events" అనే ఆప్షన్ ఉంటుంది దానిని నొక్కండి
- ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయో స్క్రాల్ చేయండి
- మీరు టిక్కెట్లను కొనుగోలు చేయడానికి లేదా మీ క్యాలెండర్కు సంఘటనను జోడించడం వంటి దాని గురించి మరింత తెలుసుకోవడానికి Event ను నొక్కండి.

 

See where you've been with the Timeline feature

See where you've been with the Timeline feature

Timeline ఫీచర్ ద్వారా మీరు వెళ్లిన ప్రదేశాలను తెలుసుకోండి

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

- మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- పైన ఉన్న Menu బట్టన్ ను క్లిక్ చేయండి
- మీ Timeline ను నొక్కండి
- మూవ్ బ్యాక్ ఇన్ టైమ్ కోసం స్క్రీన్ ను రైట్ సైడ్ కు స్వైప్ చేయండి
- నిర్దిష్ట తేదీన మీరు ఎక్కడ ఉన్నారో చూడటానికి క్యాలెండర్ ఐకాన్ పైన రైట్ సైడ్ నొక్కండి.

 

Share your location with someone

Share your location with someone

గూగుల్ ఇటీవల లొకేషన్ షేరింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రాసెస్ అంతా రియల్ టైమ్‌లో జరిగిపోతోంది.

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

-మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
-స్క్రీన్ ఎగువ ఎడమ వైపు ఉన్నమెనూ బటన్ ను నొక్కండి.
- "Location Sharing" ను చూజ్ చేసుకోండి
- "Get Started" ను నొక్కండి
- మీరు ఎంతకాలం మీ స్థానాన్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.
- మీరు మీ స్థానాన్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్న వారిని ఎంచుకోండి.

 

 

Measure distance between two points

Measure distance between two points

మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో అలాంటివి మీరు ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ప్రదేశం నుండి మరొక స్థానం ఎంత దూరంలో ఉంటుందో తెలుసుకోవచ్చు.అలాగే రెండు ప్రదేశాల మధ్య ప్రత్యక్ష దూరాన్ని కొలవవచ్చు

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

- మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- మీరు మేజర్ చేసిన మ్యాప్ యొక్క ఒక భాగాన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేయండి . ఇది ఒక పిన్ డ్రాప్ చేస్తుంది.
- ఇప్పుడు స్క్రీన్ దిగువన నొక్కండి, అది "Dropped Pin"ను చూపిస్తుంది
- "Measure distance" ఆప్షన్ ను నొక్కండి
- ఇప్పుడు కర్సర్ను రెండవ పాయింట్కి డ్రాగ్ చేయడానికి మీ స్క్రీన్ ఫై ఒక వేలు చుట్టూ స్లైడ్ చేయండి.
- స్క్రీన్ కుడి దిగువన "Add point"ను నొక్కండి
- రెండు పాయింట్ల మధ్య దూరం ఎడమవైపున మీకు చూపిస్తుంది
- పైన ఉన్న స్టెప్స్ ను ఫాలో అవుతూ అడిషనల్ పాయింట్స్ ను యాడ్ చేయండి

 

Save maps so they still work when you're offline

Save maps so they still work when you're offline

మ్యాప్స్ ను సేవ్ చేసుకుంటే అది ఆఫ్ లైన్ లో కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

- మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- పైన ఉన్న Menu బటన్ ను నొక్కండి
- "Offline Maps" ను నొక్కండి
- "Custom map" ను నొక్కండి
- మీరు ఆఫ్ లైన్ లో సేవ్ చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి
- "Download" ను సలెక్ట్ చేసుకోండి

 

Find parking near your destination before you leave

Find parking near your destination before you leave

గూగుల్ మ్యాప్స్‌లో పార్కింగ్ లొకేషన్‌ ట్రాకింగ్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ఇటీవల యాడ్ చేసింది.

ఈ ఫీచర్ ను ఉపయోగించాలంటే...

- మీ ఫోన్ లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేయండి
- మీ డెస్టినేషన్ ను సెర్చ్ చేయండి
- "Directions" ను నొక్కండి
- స్క్రీన్ పై భాగాన ఉన్న మూడు చుక్కలను నొక్కండి
- "Find parking" ను నొక్కండి
- గూగుల్ ఆటోమేటిక్ గా మీ డెస్టినేషన్ వద్ద ఉన్న పార్కింగ్ లొకేషన్స్ ను వెతికి చూయిస్తుంది
- అందులో మీకు నచ్చింది పిక్ చేసుకొని మీ రూట్ ను యాడ్ చేయండి.

 

 

Best Mobiles in India

English summary
You'll never be lost again with these fun Google Maps tricks.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X