Google Meet లో డిస్ట‌ర్బ్ చేస్తున్నారా.. అయితే పూర్తిగా బ్లాక్ చేయండి?

|

Google Meet ద్వారా ఆన్‌లైన్ మీటింగ్‌లో పాల్గొనే వారికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించే ఆప్ష‌న్‌ను ఆ సంస్థ తీసుకు రాబోతోంది. Google Meet లో మీటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు కొంద‌రు ఎదుటి వారికి అంత‌రాయం క‌లిగించేలా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అలాంటి వారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సంస్థ‌ ఓ కొత్త సొల్యూష‌న్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఆ వ్య‌క్తిని పూర్తిగా బ్లాక్ (Block) చేసే ఆప్ష‌న్ తీసుకురానుంది.

 
Google Meet లో డిస్ట‌ర్బ్ చేస్తున్నారా.. అయితే పూర్తిగా బ్లాక్ చేయండి?

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి చాలామంది జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక ప్రైవేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఆయా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ వ్యవస్థను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. కేవలం ప్రైవేటు ఉద్యోగుల నే కాకుండా పాఠశాల వ్యవస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు సైతం అన్నీ కూడా ఆన్లైన్ వేదికగానే జరుగుతున్నాయి. ఇందుకోసం ఆయా సంబంధిత వ్యక్తులు గాని, కంపెనీలు గాని స‌హోద్యోగుల‌తో మీటింగ్స్ కోసం పలు అప్లికేషన్లు లేదా సైట్లను వినియోగిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ వీడియో కాల్ కాన్ఫరెన్స్ లకు ఉపయోగపడే విధంగా ఎన్నో యాప్‌లు, సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన యాప్‌లు మాత్రం కొన్ని ఉన్నాయి. వాటిలో Google Meet, Zoom వీడియో కాల్‌ వంటి సైట్లకి భారీగా డిమాండ్ వచ్చింది. వీటిలో ఎలాంటి ఖర్చు చెల్లించకుండా ఎంత సేపు అయిన ఉచితంగా మీటింగ్లలో పాలు పంచుకోవచ్చు. అయితే ఇలా ఆన్లైన్ మీటింగ్ లో పాల్గొనే సమయంలో కొందరు వ్యక్తులు మీటింగ్ కి అంతరాయం కలిగే చేసే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరులను డిస్టర్బ్ చేయడం లేదంటే, ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివారిని మీటింగ్ లో నుండి బయటకి రిమూవ్ చేసేందుకు గూగుల్ మీట్ ఇప్ప‌టికే ఒక ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా దానికి కొన‌సాగింపుగా బ్లాక్ అనే మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను యాడ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ కొత్త బ్లాక్ (Block) ఆప్ష‌న్‌ ద్వారా అలా డిస్టర్బ్ చేసే వ్యక్తులను పూర్తిగా మళ్ళీ మీట్ లో కనెక్ట్ అవ్వకుండా చేయవచ్చు.

Google Meet లో డిస్ట‌ర్బ్ చేస్తున్నారా.. అయితే పూర్తిగా బ్లాక్ చేయండి?

వాళ్లు మ‌ళ్లీ మీటింగ్‌లోకి వ‌చ్చే అవకాశం ఉండ‌దు..
Google Meet మీటింగ్‌ల‌లో ఎలా అనవసరంగా డిస్టర్బ్ చేసి వారిని మీటింగ్ లో నుంచి బయటకి జ‌స్ట్‌ రిమూవ్ చేయడానికి ఇప్పటికే ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. కానీ అటువంటి వాళ్ళని పూర్తిగా మళ్లీ మీటింగ్ లో జాయిన్ కాకుండా చేసేందుకు బ్లాక్ ఆప్షన్ తీసుకురానుంది. ఈ బ్లాక్ ఆప్షన్ ఉపయోగించడం ద్వారా ఆ డిస్టర్బ్ చేసే వ్యక్తి ఇక మళ్లీ మీటింగ్ లో జాయిన్ కావడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతానికి ఈ యాక్షన్ కు సంబంధించి సంస్థ వర్క్ చేస్తోంది. మరో 15 రోజుల్లో ఈ ఫీచర్ను గూగుల్ మీట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఈ విధంగా ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాల నుండి అందిన సమాచారం. కంపెనీ అప్డేట్ చేసిన తర్వాత అందరికీ కనిపిస్తుంది. Android మరియు IOS (Apple) యూజర్లు తమ యాప్ ను అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది.

 
Google Meet లో డిస్ట‌ర్బ్ చేస్తున్నారా.. అయితే పూర్తిగా బ్లాక్ చేయండి?

ఇప్ప‌టికే "Mute All" ఆప్ష‌న్ అందుబాటులోకి..
Google Meet రోజురోజుకూ వినియోగ‌దారుల‌ సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ఆ సంస్థ ప‌లు సరికొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇదివ‌ర‌కు మీటింగ్ మొద‌లు పెట్టిన త‌ర్వాత Host (నిర్వ‌హ‌ణ‌దారు) కు ఇత‌ర స‌భ్యుల మైక్‌ల‌ను 'ఆఫ్' చేసే వెసులుబాటు ఉండేది కాదు. మీటింగ్ లో కొంద‌రు స‌భ్యులు మాట్లాడ‌టం పూర్తి అయిన త‌ర్వాత కూడా త‌మ మైక్ ఆఫ్ చేయ‌డం మ‌ర్చిపోతే మీటింగ్ అంతా డిస్ట‌ర్బ్ అయ్యేది. దీంతో ఆ సంస్థ అలాంటి వారిని మీటింగ్ నిర్వ‌హ‌ణ‌దారుడే మ్యూట్ చేసేలా వెసులుబాటు క‌ల్పిస్తూ కొత్త ఆప్ష‌న్ అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఇందుకోసం హోస్ట్ ఏం చేయాలంటే మ్యూట్ ఆల్ "Mute All" అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే అంద‌రి సౌండ్‌ మ్యూట్‌లోకి వెళ్తుంది. ఫ‌లితంగా స‌భ్యుల్లో ఎవ‌రైనా మ్యూట్ చేయ‌డం మ‌ర్చిపోయినా స‌భ‌కు భంగం క‌లిగే అవ‌కాశం ఉండ‌దు. మళ్లీ స‌భ్యులు ఎవ‌రైనా మాట్లాడాల్సి వ‌చ్చిన‌పుడు హోస్ట్ ఆ మ్యూట్ ఆప్ష‌న్‌ను తొల‌గించ‌వ‌చ్చు కూడా.

Best Mobiles in India

English summary
You’ll soon be able to throw unruly callers off Google Meet calls

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X