Home
Apps

ఇక జీమెయిల్ యాప్‌లో మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు..

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసును ఉద్దేశించి పలు ఆసక్తికర ఫీచర్లను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

By Bommu Sivanjaneyulu

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసును ఉద్దేశించి పలు ఆసక్తికర ఫీచర్లను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం జీమెయిల్ సర్వీస్ కోసం మరో ఆసక్తికర ఫీచర్‌ను గూగుల్ సిద్ధం చేస్తోందట. ఆ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.

ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం..

ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం..

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఫీచర్ ద్వారా జీమెయిల్ యూజర్లు తమ ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. జీమెయిల్ v8.7.15 ఏపీకే సోర్స్ కోడ్‌లో ఈ ఫీచర్‌ను గూగుల్ పొందుపరిచినట్లు సదరు సైట పేర్కొంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు జీమెయిల్ యాప్ ద్వారా ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది.

 

 

భవిష్యత్‌లో మరింత సులువుగా..

భవిష్యత్‌లో మరింత సులువుగా..

ఇప్పటికే కొన్ని పద్థతుల్లో ఈ-మెయిల్స్‌ను షెడ్యూల్ చేసుకోగలుగుతున్నప్పటికి భవిష్యత్‌లో మరింత సులువుగా వీటిని షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. "schedule send" పేరుతో ఈ డీఫాల్ట్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని ఆండ్రాయిడ్ పోలీస్ చెబుతోంది. గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ సర్వీసుల్లో ఒకటైన జీమెయిల్ 2004 నుంచి కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది.

 

 

ఇంటర్నెట్‌తో పనిలేకుండా..

ఇంటర్నెట్‌తో పనిలేకుండా..

జీమెయిల్‌లో ఇటీవల యాడ్ అయిన ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులో లేనప్పటికి జీమెయిల్‌లో వర్క్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను చదవటమే కాకుండా వాటిని ఆర్చివ్ చేయటం, డిలీట్ చేయటం, కొత్త మెయిల్‌ను క్రియేట్ చేయటం, సెర్చ్ చేయటం వంటి పనులన చక్కబెట్టుకునే వీలుటుంది. ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్ చేసిన వర్క్ మొత్తం ఆన్‌లైన్‌లో అన్ని డివైస్‌ల మధ్య సింక్ కాబడుతుంది.

 

 

జీమెయిల్ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్‌..

జీమెయిల్ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్‌..

జీమెయిల్ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా క్రోమ్ బ్రౌజర్ వర్షన్ 61ను తమ పీసీల్లో డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. బ్రౌజర్ అప్‌డేట్ అయిన తరువాత మీ జిమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ సైడ్‌లో కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే డ్రాప్‌డౌన్ మెనూలో ‘సెట్టింగ్స్' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మరో మెనూ బార్‌లో ‘ఆఫ్‌లైన్' టాబ్‌ను సెలక్ట్ చేసుకుని ‘ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్' ఆప్షన్‌ను చెక్ చేసుకుని సెట్టింగ్స్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది.

 

 

Best Mobiles in India

English summary
You may soon be able to schedule mails in Gmail app.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X