వాట్సప్ డెడ్‌లైన్ తేదీ గురించి తెలుసుకున్నారా ?

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

|

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అందరూ దీనివైపు మొగ్గు చూపుతున్న తరుణంలో యూజర్లకు వాట్సప్ ఓ చేదు వార్తను అందించింది. వాట్సప్ లో సేవ్ అయిన స్టోరీలు, వీడియోలు, ఫోటోలు గూగుల్ డ్రైవ్ నుంచి తీసివేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాట్సప్‌ వినియోగదారుల డేటా.. మెస్సేజ్‌లు, వీడియోలు, ఫొటోలు అన్నీ గూగుల్‌ డ్రైవ్‌లో ఎన్నాళ్లయినా బ్యాకప్‌ చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు వాట్సప్‌ దీనిపై కోత విధించింది

 

ఈ వాట్సప్ ట్రిక్ ట్రై చేయండి, మీ సమయాన్ని ఆదా చేయండిఈ వాట్సప్ ట్రిక్ ట్రై చేయండి, మీ సమయాన్ని ఆదా చేయండి

ఏడాది క్రితం డేటా

ఏడాది క్రితం డేటా

ఇకపై ఒక సంవత్సరం డేటా మాత్రమే గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఏడాది క్రితం డేటా మీకు తెలియకుండానే ఆటోమేటిగ్గా డ్రైవ్‌ నుంచి డిలీట్‌ అయిపోతుంది.

 

నవంబర్‌ 12, 2018 తర్వాత..

నవంబర్‌ 12, 2018 తర్వాత..

నవంబర్‌ 12, 2018 తర్వాత ఈ ఆటోమేటిక్‌ డిలీట్‌ను వాట్సప్ ప్రారంభించనుంది. ఈ లోగా డ్రైవ్‌లో ఉన్న పాత డేటాను మీరు వేరే పద్ధతిలో భద్రపరుచుకోవాలని తెలిపింది.

గూగుల్‌ డ్రైవ్‌లో ..

గూగుల్‌ డ్రైవ్‌లో ..

ఇప్పటివరకు గూగుల్‌ డ్రైవ్‌లో వాట్సప్‌ ఛాట్‌ బ్యాకప్‌ చేసుకోవడానికి సాధారణ స్టోరేజీ (15 జీబీ) మాత్రమే ఉండేది. ఈ జిబిలోనే మీ డేటాను సేవ్ చేసుకోవాల్సి ఉండేది.

గూగుల్‌, వాట్సప్‌ మధ్య ఒప్పందం
 

గూగుల్‌, వాట్సప్‌ మధ్య ఒప్పందం

అయితే గూగుల్‌, వాట్సప్‌ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ ఇబ్బంది తొలగిపోయింది. ఇకపై వాట్సప్‌ ఛాట్‌ బ్యాకప్‌ మెమొరీ గూగుల్‌ స్టోరేజీలో అన్‌లిమిటెడ్ గా ఉంటుంది.

గూగుల్‌ డ్రైవ్‌లో కేటాయించిన స్టోరేజ్‌..

గూగుల్‌ డ్రైవ్‌లో కేటాయించిన స్టోరేజ్‌..

నవంబరు 12, 2018 ఒక యూజర్‌కు గూగుల్‌ డ్రైవ్‌లో కేటాయించిన స్టోరేజ్‌ కోటా నుంచి వాట్సప్‌నకు మినహాయింపు లభిస్తుంది.

ఆటోమేటిగ్గా డిలీట్‌ ..

ఆటోమేటిగ్గా డిలీట్‌ ..

ఏడాదికి మించి డ్రైవ్‌లో ఉన్న సమాచారం ఆటోమేటిగ్గా డిలీట్‌ అయిపోతుంది. గూగుల్‌ డ్రైవ్‌ నుంచి తొలగిస్తామని తెలిపింది. కాబట్టి నవంబరు 12, 2018లోగా పాత డేటాను మ్యాన్‌వల్‌గా బ్యాకప్‌ తీసుకోవాలి.

గూగుల్‌ డ్రైవ్‌కు అనుసంధానం కాని వారు

గూగుల్‌ డ్రైవ్‌కు అనుసంధానం కాని వారు

ఇప్పటివరకూ గూగుల్‌ డ్రైవ్‌కు అనుసంధానం కాని వారు వెంటనే డ్రైవ్‌కు అనుసంధానమైన డేటాను అందులోకి మార్చుకోవాలి.

ఎక్కువ సైజ్‌ ఉంటే..

ఎక్కువ సైజ్‌ ఉంటే..

బ్యాకప్‌ ఫైల్స్‌ ఎక్కువ సైజ్‌ ఉంటే వైఫైని ఉపయోగించి సమాచారాన్ని బ్యాకప్‌ చేసుకోవడం మేలని వాట్సప్ తెలిపింది.

ఐఫోన్లకు ..

ఐఫోన్లకు ..

అయితే ఐఫోన్లకు సంబంధించి వాట్సప్‌ ఎలాంటి మార్పులు వెల్లడించలేదు.

Best Mobiles in India

English summary
WhatsApp to delete old chats if they are not refreshed before Nov 12, Google Drive free storage coming soon read more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X