ఇక నుంచి యూట్యూబ్‌లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు.

|

మార్కెట్లో నెలకున్న పోటీ వాతవరణాన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన యూట్యూబ్ యాప్‌ను మరోసారి అప్‌డేట్ చేసింది. తాజా అప్‌డేట్‌తో యూట్యూబ్ వీడియోలను మరింత సునాయశంగా షేర్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. అంతేకాకుండా, మిత్రులతో ఛాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం మొబైల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తోంది.

 

Xiaomi నుంచి మరో సంచలన ఫోన్ ఇండియాకు వస్తోందిXiaomi నుంచి మరో సంచలన ఫోన్ ఇండియాకు వస్తోంది

ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో

ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో

ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో పేరుతో సరికొత్త యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవచ్చు.లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీలో సైతం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని Smart Offline ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా వీక్షించవచ్చు.

ఇండియాలో యూట్యూబ్ యూజర్స్ ఎక్కువ..

ఇండియాలో యూట్యూబ్ యూజర్స్ ఎక్కువ..

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు.

వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు మరింతగా డిమాండ్..
 

వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు మరింతగా డిమాండ్..

యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో పేరుతో విప్లవాత్మక యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

2జీ నెట్‌వర్క్‌లలోనూ బెస్ట్ క్వాలిటీ వీడియోలు

2జీ నెట్‌వర్క్‌లలోనూ బెస్ట్ క్వాలిటీ వీడియోలు

యూట్యూబ్ గో యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్ తో ఇప్పుడు లభ్యంకానుంది.

 ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను  వీక్షించే అవకాశం..

ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించే అవకాశం..

యూట్యూబ్ గో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు వీడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

క్వాలిటీ వీడియో బ్రౌజింగ్..

క్వాలిటీ వీడియో బ్రౌజింగ్..

ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

యాప్ వినియోగించే ప్రొసీజర్..

యాప్ వినియోగించే ప్రొసీజర్..

ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీ డేటా లిమిట్‌ను బట్టి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.యూట్యూబ్ గో యాప్ ద్వారా వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించటమే కాదు వాటిని లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా మీకు సమీపంలోని యూజర్లకు షేర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
YouTube app gets in-app messaging, easy video-sharing feature. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X