ఇంటర్నెట్ స్లోగా ఉందన్న సంగతి మరచిపోండి..

Written By:

మీ ఇంటర్నట్ స్లోగా ఉండి యూ ట్యూబ్ వీడియోలు ప్లే కావడంలేదా...మీరు మంచి వీడియో చూస్తున్నప్పుడు ఇంటర్నెట్ మొరాయిస్తుందా అనే దానికి ఇప్పుడు మీరు రాంరాం చెప్పేయవచ్చు. ఇంటర్నెట్ స్లోగా ఉన్న సమయంలో కూడా మీరు వీడియోలను ఎటువంటి అవాంతరం లేకుండా చూడవచ్చు. ఇందుకోసం యూట్యూబ్ గో యాప్ అందుబాటులోకి వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ రూ 9 కోట్ల మోసం, కేసు నమోదుతో షాక్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ గో' యాప్ ద్వారా..

మీ ఇంటర్నెట్ క‌నెక్షన్‌ స్లోగా ఉన్న సమయంలో, అలాగే డేటా త‌క్కువ‌గా ఉన్నా సమయంలో యూట్యూబ్ గో' యాప్ ద్వారా మీరు యూట్యూబ్‌ వీడియోలు ఎటువంటి అంతరాయం లేకుండా చూడవచ్చు.

 

అధికారిక వెర్ష‌న్‌

ఇప్పటిదాకా ఈ యాప్ బీటా వెర్ష‌న్ మాత్ర‌మే భార‌త్‌లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు అధికారిక వెర్ష‌న్‌ కూడా అందుబాటులోకి తెచ్చింది.

ప్లే‌స్టోర్‌లో దీని వెతికిన‌పుడు..

అయితే అండ్రాయిడ్‌ ఫోన్లలో ప్లే‌స్టోర్‌లో దీని వెతికిన‌పుడు 'అన్‌రిలీజ్డ్ వెర్ష‌న్‌' అని హెచ్చ‌రిక క‌నిపిస్తోంది. కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు కానీ స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు అని సూచ‌న కూడా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.youtube.mango&hl=en

ఐఓఎస్ ఫోన్ల‌కు..

కాగా ఐఓఎస్ ఫోన్ల‌కు ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే పూర్తిస్థాయి యాప్‌ రెండు ఫోన్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డేటా సేవ్

యూట్యూబ్ గో ద్వారా డేటా సేవ్ చేసుకోవ‌చ్చు, డేటా అవ‌స‌రం లేకుండానే వీడియోల‌ను బ్లూటూత్‌, వైఫై షేర్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఏ వీడియోకు ఎంత డేటా అవ‌స‌ర‌మో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YouTube Go beta app for download in India: Here are the key features More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot