2జీ ఇంటర్నెట్‌లోనూ యూట్యూబ్ వీడియోలు, కొత్త యాప్ వచ్చేసింది
గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
ఇండియన్ యూజర్స్ కోసం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన యూట్యూబ్ గో యాప్ ఇప్పుడు బేటా వర్షన్‌లో లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read More : Galaxy On8 ధర తగ్గింది, ఎంతో తెలుసా..?

2జీ నెట్‌వర్క్‌లో కూడా పనిచేస్తుంది..
తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లో సైతం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన యూట్యూబ్ గో యాప్ యాప్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని Smart Offline ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా వీక్షించవచ్చు.

భారత్‌లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని...
భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు. యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు యూట్యూబ్ గో పేరుతో విప్లవాత్మక యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

మరిన్ని మాడిఫికేషన్స్‌తో..
యూట్యూబ్ గో యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్‌తో ఇప్పుడు లభ్యంకానుంది.

క్వాలిటీని కావల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకునే అవకాశం..
యూట్యూబ్ గో యాప్ ద్వారా ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు విడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

క్వాలిటీ వీడియో బ్రౌజింగ్...
ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది.

ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే అవకాశం..
యూట్యూబ్ గో యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా..
మీ డేటా లిమిట్‌ను బట్టి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.యూట్యూబ్ గో యాప్ ద్వారా వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించటమే కాదు వాటిని లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా మీకు సమీపంలోని యూజర్లకు షేర్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications