యూట్యూబ్ వీడియోలు చూస్తూ నిద్రలోకి జారుకొనే అలవాటు ఉంటే ఈ కొత్త ఫీచర్ మీ కోసమే..!!
యూట్యూబ్ తన వినియోగదారుల కోసం ఇటీవల అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూట్యూబ్ షాట్స్‌లో (Youtube Features) కూడా మార్పులు చేసింది. ఒక నిమిషంగా ఉన్న షాట్స్ నిడివిని (Lenth) 3 నిమిషాలకు పెంచింది. దీంతోపాటు చిన్నారుల యూట్యూబ్ వినియోగంపై తలిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్నారులు ఎటువంటి లైవ్, వీడియోలను పోస్ట్ చేసిన నోటిఫికేషన్ ద్వారా వారి తల్లిదండ్రులకు చేరేలా ఫీచర్ పనిచేస్తుంది.
తాజాగా ఈ ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం రిసైజబుల్ మినీ ప్లేయర్, స్లీప్ టైమర్ (Youtube Sleep Timer Feature), ఫేవరెట్ ప్లే లిస్ట్ వంటి ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు యూట్యూబ్ షాట్స్ కోసం వీడియో ప్లేయర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. మరియు స్మార్ట్‌టీవీలో యూట్యూబ్ ను మరింత మెరుగ్గా ఉపయోగించుకొనేందుకు వీలుగా అప్‌డేట్ చేసింది.

ప్రస్తుతం అనేక మంది రాత్రి సమయాల్లో నిద్రకు ముందు యూట్యూబ్‌ను వీక్షిస్తున్నారు. అయితే కొన్నిసార్లు యూట్యూబ్ వీడియోలు చూస్తునే నిద్రపోతున్నారు. దీంతో వీడియోలు అలానే ప్లే అవుతున్నాయి. దీని వల్ల డేటా సహా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్లీప్ టైమర్ పేరుతో (Sleep Timer) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంలో యూట్యూబ్‌లో టైమర్ సెట్ చేసుకోవచ్చు. దీంతో ఆ సమయం రాగానే యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. సెట్టింగ్స్ ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. తాజాగా వినియోగదారులు అందరికీ విడుదల చేసింది.

తాజాగా మినిప్లేయర్‌లోనూ కొన్ని మార్పులు చేసింది. యూట్యూబ్‌లో ఈ ప్లేయల్ కుడివైపున ఉంటుంది. తాజా అప్‌డేట్‌తో ఈ మినీ ప్లేయర్‌ను మీకు నచ్చిన వైపున పెట్టుకోవచ్చు. దీంతోపాటు సైజ్‌లో కూడా మార్పులు చేసుకోవచ్చు. ఫలితంగా యూట్యూబ్‌ను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. యూట్యూబ్ టీవీ యాప్‌లోనూ షాట్స్ వీడియో ప్లేయర్‌ను అప్‌డేట్ చేసింది.
దీంతోపాటు మరో ఆసక్తికర ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో ఇప్పటికే ప్లే లిస్ట్‌ను కేటగిరి వారీగా క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌లతో ఈ ప్లే లిస్ట్‌కు ఫోటోలను యాడ్ చేసుకోవచ్చు. మరియు క్యూఆర్ కోడ్ ద్వారా ఇతరులకు పంపవచ్చని తెలిపింది.
యూట్యూబ్ ఇటీవలే షాట్స్‌లో కీలక మార్పులు చేసింది. గతంలో షాట్స్ నిడివి కేవలం 60 సెకన్లు మాత్రమే ఉండేది. అక్టోబర్ 15 నుంచి ఈ షాట్స్‌ను 3 నిమిషాల నిడివి (Lenth) తో అప్‌లోడ్ చేసేందుకు వీలుంది. కంటెంట్ క్రియేటర్‌ల నుంచి వచ్చిన రిక్వస్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది. వీటితోపాటు యూట్యూబ్ షార్ట్స్ ను స్ట్రీమ్ లైన్డ్ లుక్ తో అప్‌డేట్ చేసింది.
గత నెలలోనే చిన్నారుల యూట్యూబ్ వినియోగంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా యూట్యూబ్ ఫ్యామిలీ సెంటర్ పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా చిన్నారుల అకౌంట్లను వారి తల్లిదండ్రులు లింక్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా చిన్నారులు లైవ్, వీడియోలను అప్‌లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో తల్లిదండ్రులకు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








