YouTube Shorts వీడియో యాప్ వచ్చేసింది!!! టిక్‌టాక్ ప్రియులకు ఊరట...

|

టిక్‌టాక్ 15 సెకన్ల వీడియో సర్వీస్ మొదలైన తరువాత ప్రపంచం మొత్తం కూడా దీనికి చాలా బాగా అలవాటుపడ్డారు. నిలువు వరుసలో వీడియోలను చూడడానికి అనుమతించే ఈ సర్వీస్ ప్రపంచం మొత్తం బాగా పాపులర్ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్థులు కూడా ఇటువంటి తమ యొక్క వీడియో సర్వీసులను విడుదల చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రారంభించింది. ఇప్పుడు గూగుల్ కూడా యూట్యూబ్ షార్ట్స్ అనే 15 సెకన్ల షార్ట్ వీడియో సర్వీసును ప్రారంభించింది.

యూట్యూబ్ షార్ట్స్ వీడియో యాప్ ముఖ్య సమాచారం

యూట్యూబ్ షార్ట్స్ వీడియో యాప్ ముఖ్య సమాచారం

ఇండియాలో కొన్ని కారణాల వలన ఇటీవల టిక్‌టాక్ తో సహా 108 చైనా యాప్ లను విడుదల చేసింది. తరువాత టిక్‌టాక్ కు బదులుగా చాలా మంది పోటీగా తమ తమ షార్ట్ వీడియో యాప్ లను విడుదల చేసారు. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ యాప్ కూడా మొదటిసారిగా భారతదేశంలో బీటా వెర్షన్ లో ప్రారంభించబడింది. ఇండియాలో గల అతిపెద్ద యూజర్ బేస్ దృష్టిలో ఉంచుకొని యూట్యూబ్ షార్ట్స్ ప్రధానంగా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి వీడియోలను అప్‌లోడ్ చేసే విధానం మీద దృష్టి పెడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

యూట్యూబ్ షార్ట్స్ వీడియో యాప్ భవిషత్ అప్ డేట్లు

యూట్యూబ్ షార్ట్స్ వీడియో యాప్ భవిషత్ అప్ డేట్లు

ఇండియాలో యూట్యూబ్ షార్ట్స్ వీడియో యాప్ యొక్క  ప్రారంభ సంస్కరణను ప్రస్తుతం విడుదల చేస్తున్నాము. కానీ ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న షార్ట్స్ యొక్క కొన్ని కొత్త సృష్టి టూల్ లను రాబోయే కొద్ది రోజులలో బీటా వెర్షన్ లో విడుదల చేయనున్నాము అని యూట్యూబ్ షార్ట్‌ల సృష్టికర్తలు మరియు గ్లోబల్ యూజర్లు గూగుల్ యొక్క పోస్ట్‌ ద్వారా తెలిపారు. అలాగే రాబోయే నెలల్లో మరిన్ని ఫీచర్లను జోడించి ప్రపంచ మార్కెట్లకు దీనిని విస్తరించబోతున్నట్లు గూగుల్ తెలిపింది.

YouTube షార్ట్స్ నుండి ఆశించగలిగే విషయాలు

YouTube షార్ట్స్ నుండి ఆశించగలిగే విషయాలు

*** యూట్యూబ్ షార్ట్స్ యాప్ కొన్ని కొత్త కొత్త టూల్ లతో ప్రారంభమైంది. దీని యొక్క బీటా వెర్షన్ మల్టీ-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీడియో యొక్క సృష్టికర్తలు అనేక వీడియో క్లిప్‌లను ఒక దానిలో కలిపి ఉంచడానికి సహాయపడుతుంది.

*** భవిష్యత్తులో పాటల లైబ్రరీ నుండి సంగీతంతో రికార్డ్ చేయడానికి ఒక ఎంపికను కలిగి ఉంటుంది అని కూడా గూగుల్ వాగ్దానం చేసింది.

*** వీడియోలను ప్రారంభించడానికి టైమర్ మరియు కౌంట్‌డౌన్ వంటి ప్రాథమిక టూల్లను నిర్వహించే ఎంపికను యూట్యూబ్ షార్ట్స్ అందిస్తుంది.

*** వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో సృష్టికర్తలు ఎక్కువ విషయాలను దాని సామర్థ్యాన్ని మించి అందించడానికి సంస్థ పని చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
YouTube Launched 'Shorts' Video App Like as TikTok

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X