యూట్యూబ్ ఆ ఫీచర్‌ని పూర్తిగా తీసేస్తోంది
వీడియో బేస్ డ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ తిరుగులేకుండా దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 1.9 బిలియన్ల యూజర్లతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.
వీడియో బేస్ డ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ తిరుగులేకుండా దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 1.9 బిలియన్ల యూజర్లతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. పోటీ ప్రపంచంలో ఇంకా ముందుకెళ్లాలనే తాపత్రయంలో యూట్యూబ్ ఫీచర్లను ఎప్పటికప్పుడడు మార్చుతూ వస్తోంది. అవసరంలేని, ప్రాధాన్యత లేని ఫీచర్లను తీసివేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు annotationsని డిస్ కంటిన్యూ చేస్తోంది. అయితే ఈ ఫీచర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ annotations editor ఫీచర్ ను డిస్ కంటిన్యూ చేస్తున్నట్లు మే2వ తేదీ 2017న గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు ఆ ఫీచర్ ని పూర్తిగా ఆపివేస్తున్నట్లు తెలిపింది.

ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో తీసివేస్తున్నామని ప్రకటించింది...
తన డెడికేటడ్ పేజీలో ఈ ఫీచర్ ఆపివేస్తున్నామని జనవరి 15 2019 నుంచి ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో తీసివేస్తున్నామని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఈ ఫీచర్ ని యూజర్లు చూడలేరని పూర్తిగా తొలగిస్తామని ప్రకటించింది.

యూట్యూబ్ ప్లే చేస్తున్నప్పుడు....
యూట్యూబ్ ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో స్క్రీన్ మీద పాత వీడియో లింకులు కనిపిస్తూ ఉంటాయి. వీటినే annotations కార్డ్స్ అని పిలుస్తారు. యూజర్లు వీడియో మేనేజర్ లో కెళ్లి అక్కడ వీడియోని ఎడిట్ చేస్తే అౌపై భాగంలీ మీకు ఈ ఆప్సన్ కనిపిస్తుంది. పక్కన ఎండ్ కార్డు కనిపిస్తుంది.

ఈ ఫీచర్ ని తీసివేయడం వల్ల....
ఈ ఫీచర్ ని తీసివేయడం వల్ల యూట్యూబ్ యూజర్లు వీడియోని ఎటువంటి అంతరాయం లేకుండా చూడవచ్చు. మధ్యలో ఈ లింకులు రావడం దాన్ని క్లోజ్ చేయడం లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

ఈ ఫీచర్ ని యూట్యూబ్ ఎందుకు తీసివేస్తుందంటే....
మరి ఈ ఫీచర్ ని యూట్యూబ్ ఎందుకు తీసివేస్తుందంటే ఎండ్ కార్డ్స్ డిమాండ్ బాగా పెరగడం అలాగే annotations 70 శాతానికి పడిపోవడం కారణంగా తెలుస్తోంది. ఈ ఫీచర్ తీసివేసిన తరువాత పాత annotationsని మీరు ఎడిట్ చేయడం కాని మార్చడం కాని చేయలేరు. డిలీట్ ఆప్సన్ మాత్రమే ఉంటుంది.

ఈ annotations కేవలం...
ఈ annotations కేవలం లిమిటెడ్ డెస్క్ టాప్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.మొబైల్స్ కి అందుబాటులో ఉండదు. అయితే కార్డ్స్ మాత్రం మొబైల్స్ లో అందుబాటులో ఉంటాయని యూట్యూబ్ తెలిపింది. కాగా ఇప్పుడు దాదాపు 60 శాతం మొబైల్స్ ద్వారానే యూట్యూబ్ ని వీక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications








