యూజర్లకు షాక్ : యూట్యూబ్‌లో ఆ ఫీచర్లు ఔట్

Written By:

యూట్యూబ్ యూజర్లకు షాకివ్వబోతోంది. ఓ రెండు ఫీచర్లను సెప్టెంబర్‌ 20 నుంచి తన ప్లాట్‌ఫామ్‌పై తొలగిస్తోంది. వీడియో ఎడిటర్‌, ఫోటో స్లైడ్‌షోస్‌ టూల్స్‌ సెప్టెంబర్‌ 20తో రిటైర్‌ అయిపోతాయని యూట్యూబ్‌ తెలిపింది. ఇది నిజంగా యూజర్లకు చేదులాంటిదే.

నోకియా నుంచి అత్యంత చీపెస్ట్ ఫీచర్ ఫోన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూజర్లకు కొంచెం ఊరటనిస్తూ

యూజర్లకు కొంచెం ఊరటనిస్తూ అన్ని ఎడిటింగ్‌ ఫీచర్లను యూట్యూబ్‌ తీసివేయడం లేదు. ట్రిమింగ్‌, బ్లరింగ్‌, ఫిల్టర్స్‌ వంటి వాటిల్లో మెరుగుపరిచిన వాటిని వీడియో క్రియేటర్స్‌ వాడుకోవచ్చని యూట్యూబ్‌ చెప్పింది.

తొలగించడానికి ప్రధాన కారణం

ఈ ఫీచర్లను తొలగించడానికి ప్రధాన కారణం, వీటిని తక్కువగా వాడేలా చేసేందుకేనని కంపెనీ వివరించింది.

కొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయడానికి

వీటికి స్వస్తి పలికి, కొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయడానికి, ఉన్నవాటికి మెరుగుపరడానికి చూస్తున్నామని గూగుగ్‌ ప్రొడక్ట్‌ ఫోరమ్‌ పేజ్‌ కమ్యూనిటీ మేనేజర్‌ మారిస్సా చెప్పారు.

సెప్టెంబర్‌ 20 వరకు

వీడియో ఎడిటర్‌ లేదా ఫోటో స్లైడ్‌షో సెక్షన్‌పై ప్రాజెక్టులు ఉన్న యూట్యూబ్‌ క్రియేటర్లు సెప్టెంబర్‌ 20 వరకు వీటిపై పైనలైజ్‌ చేసుకోవాలని, లేనిపక్షంలో వారు ప్రాజెక్టులు కోల్పోతారని చెప్పారు.

ఇప్పటికే పబ్లిష్‌ అయిన వీడియోలు

వీడియో ఎడిటర్‌ లేదా ఫోటో స్లైడ్‌షోస్‌లతో ఇప్పటికే పబ్లిష్‌ అయిన వీడియోలు మాత్రం దీనికి ప్రభావితం కావు.

720పీ రెజుల్యూషన్‌లోనే డౌన్‌లోడ్‌

ఒకవేళ ఆ వీడియోలను వీడియో ఎడిటర్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే కష్టం. 720పీ రెజుల్యూషన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YouTube Video Editor, Photos Slideshows to Be Discontinued on September 20 Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot