నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

Written By:

రోజురోజుకు పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో కంపెనీలు కొత్త కొత్త ఎత్తులకు తెరలేపుతున్నాయి. దాన్ని క్యాష్ చేసుకునే మార్గాలను కంపెనీలు వెతుకుతున్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు ఓ కంపెనీ సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. వినోదపు రంగంలోనే అతి పెద్ద కంపెనీగా ప్రసిద్ధి చెందిన జీ గ్రూపు ఈ సరికొత్త పధకాన్ని అమల్లోకి తెస్తోంది, కేవలం 20 రూపాలయతో నెలకు 100కు పైగా చానళ్లను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.

Read more: షాకింగ్ న్యూస్ : గూగుల్ క్రోమ్‌తో బ్యాటరీ డెడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వినోద రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న జీ గ్రూపు డిట్టో టీవీ పేరుతో స్మార్ట్ ఫోన్ యూజర్లకు తక్కువ ధరకే టీవీ చానళ్ల ప్రసారాలను అందించేందుకు ముందుకు వచ్చింది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

నెలకు 20 రూపాయలకే 100కు పైగా టీవీ చానళ్ల ప్రసారాలను అందుకోవచ్చు. డిట్టో టీవీ చానల్ నెలవారీ చందా 20 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

జీ గ్రూపు సిటీ కేబుల్, ఐడియా సెల్యులర్ నెట్ వర్క్ లతో భాగస్వామ్యం కుదుర్చుకుని డిట్టో టీవీ ప్రసారాలను అందిస్తోంది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

ఐడియా 3జీ, 4జీ చందాదారులు నెలవారీ డేటా ప్యాక్ తో ఉచితంగా డిట్టో టీవీ చందాదారులుగా చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. మూడు నెలలకు రూ. 50, ఆరు నెలలకు రూ.90, ఏడాది చందా రూ.170గా తెలిపింది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్ ఫామ్ లపై డిట్టో టీవీ అందుబాటులో ఉంచినట్టు జీ గ్రూపు ప్రకటించింది. డిట్టో టీవీ యాప్ ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా టీవీ ప్రసారాలను చూసుకోవచ్చని కంపెనీ అంటోంది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

అయితే ఇప్పటికే డిష్ టీవీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో లైవ్‌టీవీ చూసేందుకు వీలైన ‘డిష్ ఆన్‌లైన్' అప్లికేషన్‌ను విడుదల చేసింది. బోలెడన్ని కేటగిరీలు, చానెళ్లున్న ఈ అప్లికేషన్‌ను రూ.49కే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.దీనికి ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ను ‘డిట్టో టీవీ' అందిస్తోంది.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

అయితే డిష్ పోటీదారు టాటా స్కై మరో అడుగు ముందుకేసి ‘ఎవ్రీవేర్ టీవీ' పేరిట కొత్త అప్లికేషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టీవీ చూడటానికే కాక... దాన్ని రికార్డ్ చేసుకోవడానికీ వీలు కల్పించటం దీని ప్రత్యేకత.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

ఇక ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ.. వినియోగదారులు లైవ్‌టీవీ చూస్తూనే ట్వీట్ చేసుకోవటం, ఇతరులతో మాట్లాడటం వంటి అవకాశాల్ని కల్పిస్తోంది. ఈ ట్వీట్లు ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలో ప్రసారమవుతాయి కూడా.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

మొబైల్, కంప్యూటర్, స్మార్ట్ టీవీ... ఇలా ఎక్కడైనా యప్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే న్యూస్ చానెళ్ల వరకూ ఉచితంగానే వస్తున్నాయి. చాలా చానెళ్లు వాటి లైవ్ టీవీలను ఫ్రీగానే ఇస్తున్నాయి.

నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

వీటికి ఇంటర్‌నెట్ చార్జీలు తప్ప... టీవీకంటూ ఎలాంటి చార్జీలూ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ జి టివి, ఇండియా లైవ్‌టీవీ వంటి యాప్స్ కూడా చాలానే ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Zee Digital relaunches dittoTV app with pricing at Rs 20 per month
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot