Zomato District App సినిమా, లైవ్ షో టికెట్లు, డైనింగ్ టేబుల్ బుకింగ్ కోసం జొమాటో కొత్త యాప్..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో నుంచి ఇటీవల సూపర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఫుడ్ రెస్క్యూ పేరుతో లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫుడ్ వేస్టేజ్ కాకుండా కట్టడి చేస్తుందని భావిస్తోంది. తాజాగా జొమాటో డిస్ట్రిక్ట్ పేరుతో కొత్త యాప్ ను (Zomato launched District app) లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్‌లో జోమాటో ఇప్పటికే మంచి గుర్తింపు పొందింది. తాజాగా కొత్త యాప్ ద్వారా సేవలను విస్తరణకు నిర్ణయం తీసుకుంది.
డిస్ట్రిక్ట్ యాప్ ఉపయోగాలు ఏంటి ? : జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో సినిమా టికెట్లు బుకింగ్, ఈవెంట్‌లు, స్పోర్ట్స్, లైవ్ షోల కోసం టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. దీంతోపాటు డైనింగ్ ను యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. జొమాటో నెట్‌వర్క్ లోని హోటళ్లు, రెస్టారెంట్‌ల నుంచి టేబుల్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చు.

పేటిఎం నుంచి టికెట్ బిజినెస్ ను జొమాటో ఈ సంవత్సరం ఆగస్టులో కొనుగోలు చేసిన విషయం తెలిసింది. ఈ డీల్ విలువ రూ.2048 కోట్లుగా ఉంది. ఫలితంగా ప్రస్తుతం టికెట్ బుకింగ్ సేవల్లో ఉన్న సంస్థలకు పోటీనిచ్చే అవకాశం ఉంది. జోమాటో సంస్థకు ఉన్న ప్రస్తుత నెట్‌వర్క్ ఇందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది.
* గత వారం జొమాటో ఫుడ్ రెస్క్యూ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆహారం వృథాను కట్టడి చేయడమే తమ ఉద్దేశమని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ ఫీచర్‌లో భాగంగా తక్కువ ధరకే పరిమిత యూజర్లకు తక్కువ ధరకే ఫుడ్ లభిస్తుంది. ఈ ఫీచర్ గురించి గత వారం జొమాటో సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటన చేశారు.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం నెలవారీ 4 లక్షల ఫుడ్ ఆర్డర్‌లు క్యాన్సిల్ అవుతున్నాయని, కొన్నిసార్లు ఆ ఫుడ్ వేస్టేజ్ అవుతోందని చెప్పారు. అయితే ఈ ఫుడ్ రెస్క్యూ ఫీచర్ కారణంగా.. ఏదైనా ప్రాంతంలో ఫుడ్ ఆర్డర్ క్యాన్సిల్ అయితే.. ఆ ఆర్డర్‌ను తీసుకెళ్తున్న డెలివరీ పార్టనర్‌కు సమీపంలోని 3 కిలోమీటర్ల పరిధిలోని ఇతర కస్టమర్‌లకు జొమాటో యాప్‌లో ఓ నోటిఫికేషన్ కనిపిస్తుంది. తక్కువ ధరకే ఆహారం అందుబాటులో ఉందని, కొన్ని నిమిషాల మాత్రమే సమయం ఉందని అలెర్ట్ చేస్తుంది.
ఈ ఫుడ్ ఆర్డర్ పై ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిపై స్పందించవచ్చు. దీంతోపాటు ఈ ఆర్డర్ కొన్ని నిమిషాల్లోనే డెలివరీ కానుంది. ఐస్ క్రీం, షేక్స్, స్మూతీలకు ఈ ఆఫర్ వర్తించదని జొమాటో తెలిపింది. ఫలితంగా ఆహారం వృథా కాకుండా చూస్తుందని భావిస్తున్నట్లు జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటన చేశారు.
దీంతోపాటు ఈ ఫీచర్‌పై కీలక సూచనలు చేసిన, వ్యక్తితో కలిగి పనిచేద్దామంటూ దీపిందర్ గోయల్ ఆఫర్ ఇచ్చారు. ఆహారం వృథా కాకుండా జొమాటో తీసుకుంటున్న చర్యలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. దీంతోపాటు సూచనలు చేసిన వ్యక్తికి ఉద్యోగం ఆఫర్ చేయడంపైనా జొమాటో ను మెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications