సామ్‌సంగ్ నుంచి గేర్ 360 కెమెరా

Written By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016ను పురస్కరించుకుని బార్సిలోనాలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్. గేర్ 360 పేరుతో ఓ విప్లవాత్మక కెమెరాను లాంచ్ చేసింది. ఈ 360 డిగ్రీ వర్చువల్ కెమెరా ద్వారా ఫోటోలతో పాటు వీడియోలను హైరిసల్యూషన్‌లో క్యాప్చర్ చేయవచ్చు. ప్రయాణాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో ఈ కెమెరాను ఉపయోగించుకోవచ్చు. డ్యయల్ లెన్స్ సౌకర్యంతో వస్తున్న ఈ కెమెరా ద్వారా హైరిసల్యూషన్ వీడియోలతో పాటు 30 మెగా పిక్సల్ క్వాలిటీలో ఫోటోలను షూట్ చేయవచ్చు. ఈ కెమెరాతో పాటు ట్రైపోడ్‌ను సామ్‌సంగ్ అందిస్తోంది. కెమెరాలో మొత్తం నాలుగు మోడ్స్ ఉంటాయి.

సామ్‌సంగ్ నుంచి గేర్ 360 కెమెరా

కెమెరా స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

DRIMe5s ఇమేజ్ ప్రాసెసర్. 0.5 అంగుళాల PMOLED డిస్‌ప్లే. మెక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా కెమెరా మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. ఐపీ53 రేటింగ్ (వర్షంలోనూ ఈ కెమెరాను వాడుకోవచ్చు). ఈ కెమెరాను సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకుని రికార్డ్ అవుతున్నకంటెంట్‌ను రియల్ టైమ్‌లో ప్రివ్యూ చూడొచ్చు. కెమెరాలో మొత్తం నాలుగు మోడ్స్ ఉంటాయి (ఇమేజ్ మోడ్, వీడియో మోడ్, టైమ్-లాప్స్ మోడ్, లూప్ మోడ్). వై-ఫై, వై-ఫై డైరెక్ట్, బ్లుటూత్, యూఎస్బీ, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది.1350 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీని కెమెరాలో పొందుపరిచారు. గేర్ 360 కెమెరాలోకి 5 ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గేర్ 360 కెమెరాలోని ప్రత్యేకతలు

గేర్ 360 కెమెరా డ్యుయల్ fisheye lensesతో వస్తోంది. ఒక్క లెన్సెస్ 15 మెగా పిక్సల్ ఇమేజ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా 30 మెగా పిక్సల్ క్వాలిటీలో ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. అలానే 3840x1920 పిక్సల్ హైరిసల్యూషన్ క్వాలిటీతో కూడిన వీడియోలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ 360 కెమెరాలోని ప్రత్యేకతలు

గేర్ 360 కెమెరా ద్వారా 180 డిగ్రీ వైడ్ యాంగిల్ వీడియోలు సాధ్యపడతాయి. తక్కువ వెళుతురులోనూ ఈ కెమెరా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఈ కెమెరాలో పొందుపరిచిన బ్రైట్ లెన్స్ ఎఫ్2.0 ద్వారా హైరిసల్యూషన్ ఫోటోలతో పాటు పూర్తి పానోరమిక్ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ 360 కెమెరాలోని ప్రత్యేకతలు

గేర్ 360 కెమెరా ద్వారా చిత్రీకరించబడిన కంటెంట్ ఆటోమెటిక్‌గా మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కెమెరాలోని డేటాను నేరుగా సోషల్ మీడియోలో షేర్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ 360 కెమెరాలోని ప్రత్యేకతలు

గేర్ 360 కెమెరాను తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లతో పాటు గెలాక్సీ ఎస్6 ప్లస్, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్, గెలాక్సీఎస్6, గెలాక్సీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గేర్ 360 కెమెరాలోని ప్రత్యేకతలు

గేర్ 360 కెమెరా ద్వారా రికార్డ్ చేసిన కంటెంట్‌ను వీఆర్ యాప్ ద్వారా అత్యుత్తమంగా వీక్షించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Important Things About Samsung's Latest Gear 360 Camera Which Every Photographer Should Know!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot