చిటికలో మీ ఐఫోన్‌ను కెమెరాలా మార్చేస్తుంది!!

Posted By: Staff

 చిటికలో మీ ఐఫోన్‌ను కెమెరాలా మార్చేస్తుంది!!

 

స్మార్ట్‌ఫోన్‌ల ఆవిర్భావంతో డిజిటల్ ఫోటోగ్రఫీ వ్యవస్థ ప్రపంచంలోని అత్యధిక జనాభాకు చేరువయ్యింది.  అయితే స్మార్ట్‌ఫోన్‌లలో అమర్చుతున్న కెమెరాలు క్వాలిటీ ఫోటోగ్రఫీని అందించటంలో విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ బెల్కిన్ ప్రత్యేకించి ఐఫోన్‌ల కోసం కెమెరా గ్రిప్ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేసింది. ఈ డివైజ్‌ను ఐఫోనకు ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఐఫోన్ డిజిటల్ కెమెరా లుక్‌ను సంతరించుకుంటుంది. ఈ గ్యాడ్జెట్‌ను ఐఫోన్‌కు జత చేయ్యటం ద్వారా వినియోగదారుడు ఫోటోలు అదేవిధంగా వీడియోలను చిత్రీకరించే సందర్భంలో క్వాలిటీతో కూడిన ఫోటోగ్రఫీ అనుభూతికి లోనవుతాడు. ఈ గ్రిప్ గ్యాడ్జెట్‌ను రిమోట్ సాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు.

రిమోట్ కంట్రోల్ సాంధ్రత 9 మీటర్లు. వీడియో రికార్డ్ బటన్‌తో పాటు షట్టర్ రిలీజ్

బటన్‌ను ఏర్పాటు చేశారు. ఐఫోన్ ఛార్జింగ్ స్లాట్‌కు ఈ పరికరాన్ని జత చేసుకోవల్సి ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ అనుసంధానంతో తక్కువ వెలుతురులో సైతం క్వాలిటీతో కూడిన విజువల్స్‌ను శ్రోత చిత్రీకరించుకోవచ్చు. విలువ రూ.2,500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot