చిన్నారుల కోసం నికాన్ కూల్‌పిక్స్ ఎస్30

Posted By: Prashanth

చిన్నారుల కోసం నికాన్ కూల్‌పిక్స్ ఎస్30

 

ప్రత్యేకించి చిన్నారుల కోసం నికాన్ సరికొత్త కూల్‌పిక్స్ కెమెరాను డిజైన్ చేసింది. పిక్స్ ఎస్30గా రానున్న ఈ డిజిటల్ ఫోటోగ్రఫీ డివైజ్‌ను చిన్నారులు సులువుగా ఆఫరేట్ చేసుకోవచ్చు. కెమెరా ప్రధాన ఫీచర్లు: 2.7 అంగుళాల కలర్ LCD స్క్రీన్, మన్నికైన బాడీ, (80 సెంటీమీటర్లు ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరని తత్వం), వాటర్ ప్రూఫ్ వ్యవస్థ (3 మీటర్ల లోతైన నీటిలో పడినప్పటికి పనిచేస్తుంది), 10.1 మెగా పిక్సల్ సీసీడి ఇమేజ్ సెన్సార్, 720 పిక్సల్ మూవీ రికార్డింగ్, యూఎస్బీ కనెక్టువిటీ, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, నికాన్ సీ2 ఇమేజ్ ప్రాసెసింగ్ ఇంజన్, ఆటో సెన్సిటివిటీ ఐఎస్‌వో.

కెమెరా పై భాగంలో ఏర్పాటు చేసిన మూడు పెద్ద బటన్లు మూవీ రికార్డింగ్, పవర్ స్విచ్చింగ్, షట్టర్ రిలీజింగ్‌కు తోడ్పడుతాయి. ఈ బటన్ వ్యవస్థ ఆధారంగా చిన్నారులు కమెరాను సులువుగా ఆపరేట్ చేయ్యవచ్చు. ఏర్పాటు చేసిన 3ఎక్స్ జూమ్ నిక్కార్ లెన్స్ అదే విధంగా 10 మెగా పిక్సల్ సీసీడి ఇమేజ్ సెన్సార్ వ్యవస్థలు ఉత్తమ ఫోటోలను క్యాప్చుర్ చేస్తాయి. కెమెరాలో ఏర్పాటు చేసిన యూఎస్బీ కనెక్టువిటీ, ఫోటోలు అదేవిధంగా వీడియోలను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. SDHC, SD, SDXC మెమరీ కార్డ్ల్‌లను కెమెరా సపోర్ట్ చేస్తుంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన స్ర్కాప్‌బుక్ ఆప్షన్ ఫోటోలను గ్యాలరీ రూపంలో డిజైన్ చేసుకునేందుకు సహకరిస్తుంది. పింక్, బ్లాక్, బ్లూ, వైట్ వంటి 4 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో కెమెరా లభ్యమవుతుంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.6,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot