ప్యానాసానిక్ లూమిక్స్ ఫస్ట్ లుక్

Posted By: Super

ప్యానాసానిక్ లూమిక్స్ ఫస్ట్ లుక్

 

ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ప్యానసానిక్ తాజాగా ఓ కెమెరాను రూపొందించింది. ప్యానసానిక్ జీఎఫ్5 వస్తున్న ఈ ఫోటోగ్రఫీ డివైజ్ మునుపటి మోడల్ జీఎఫ్3కు సక్సెసర్. ఈ కెమెరాకు సంబంధించి వెబ్ లో ప్రత్యక్షమైన ఓ ఇమేజ్ అనేక అంచనాలకు తావిస్తుంది. ప్యానసానిక్ మునుపటి మోడల్ జీఎఫ్3కు ఇంచుమించు సమాన పోలికలను కలిగి ఉన్న జీఎఫ్5 హ్యాండ్ గ్రిప్ విషయంలో స్వల్ప తేడాను పరిశీలించవచ్చు. ఈ కెమెరా ప్రొఫెషనల్ స్ధాయి ఫోటోలను బంధించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కెమెరా ఖచ్చితమైన విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని కీలక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

- 12 మెగాపిక్సల్ ఇమేజ్ సెన్సార్,

- ఐఎస్‌వో పరిధి 12,800,

- 920కె డాట్ ఎల్‌సి‌డి స్ర్కీన్,

- ఉత్తమ సిగ్నల్‌తో కూడిన నాయిస్ రేషియో.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot