హై డెఫినిషన్ మల్టీ ఫార్మాట్ కెమెరా!!

Posted By:

హై డెఫినిషన్ మల్టీ ఫార్మాట్ కెమెరా!!

 

ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 19 వరకు  లాస్‌వేగాస్‌లో నిర్వహించనున్న ఎన్ఏబి ( NAB)షోకు ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ ( FFV) సంస్థ సిద్ధమవుతుంది. ఈ వేదిక పై సైడ్‌కిక్ హెచ్‌డి పేరుతో మల్టీ ఫార్మాట్ కెమెరాను ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ సంస్థ ఆవిష్కరించనుంది. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న క్యామ్‌కార్డర్‌లకు ఈ డెఫినిషన్ కెమెరా డివైజ్ సరితూగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్ మౌంటబుల్ డీవీఆర్ కెమెరా ప్రీ పొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను బేషుగ్గా నిర్వహించుకోవచ్చు. ఈ కెమెరాలో గుర్తించి దగిన అంశాన్ని ప్రస్తావిస్తే,  ఎడిటింగ్ ప్రక్రియను సమర్దవంతగా నిర్వహించుకోవచ్చు. కెమెరా డేటా స్ట్ర్రీమ్ రికార్డింగ్ స్పీడ్  220 MBPS, కంప్రెషన్  రేషియో 7:1. వీడియోలను నేరుగా హైడెఫినిషన్ స్ర్కీన్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు హెచ్‌డిఎమ్ఐ అవుట్ సౌలభ్యత, సాధారణ క్యామ్‌కార్డర్లతో పోలిస్తే సైడ్‌కిక్ హెచ్‌డి ఉత్తమ క్వాలిటీ స్సెసిఫికేషన్‌లను కలిగి ఉంది. మానిటర్ స్ర్కీన్ పరిమాణం 4.3 అంగుళాలు, ఇండియన్ మార్కెట్లోఈ మల్టీ ఫార్మాట్ కెమెరా ధర త్వరలోనే వెల్లడవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot