జేబు సైజ్ క్యామ్‌కార్డర్!!

Posted By: Super

జేబు సైజ్ క్యామ్‌కార్డర్!!

 

సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే సోనీ అత్యుత్తమ పాకెట్ సైజ్ క్యామ్‌కార్డర్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. సాధారణ క్యామ్‌కార్డర్‌లతో పోలిస్తే తక్కువ సైజ్ పరిమాణాన్ని కలిగి ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీకి తోడ్పడే ఈ హై డెఫినిషన్ పాకెట్ సైజ్ డివైజ్ పేరు

‘బ్లాగీ టచ్ ఎమ్‌హెచ్ఎస్-టీఎస్20కే’. ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...

* 3 అంగుళాల టచ్ స్ర్కీన్ ఎల్‌సీడి స్ర్కీన్,

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ (1920x1080పిక్సల్ రిసల్యూషన్ తో),

* బ్యాటరీ ఛార్జ్ చేసుకునేందుకు యూఎస్బీ కనెక్టర్

* 8జీబి ఇంటర్నల్ మెమెరీ,

* హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ,

* 32ఎమ్ఎమ్ ఎఫ్2.8 లెన్స్,

* 360 డిగ్రీ పానోరమా లెన్స్ ఆడాప్టర్,

* ఆటో మాక్రో మోడ్ ఫోకస్,

* ఏఫ్/ఏఈ ఫోకస్,

* స్థిరమైన షాట్ స్థిరీకరణ (స్టడీ షాట్ స్టెబిలైజేషన్),

* 4ఎక్స్ డిజిటల్ జూమ్,

* MPEG4 AVC/H.264 (MP4)ఫార్మాట్,

* డివైజ్ బరువు 125 గ్రాములు.

ఈ పాకెట్ సైజ్ క్యామ్‌కార్డర్ ద్వారా పూర్తి స్ధాయి క్వాలిటీతో కూడిన స్టిల్ ఇమేజస్ అదే విధంగా వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. త్వరలో లభ్యం కానున్న ఈ క్యామ్ కార్డర్ విలువ రూ.12,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot