కెమెరాలో ఆటోఫోకస్ అంటే ఏంటి..?

కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫోటోగ్రఫీ అనేది ఒక డిజిటల్ ఇంకా డీఎస్ఎల్ఆర్ కెమెరాల ద్వారానే సాధ్యమయ్యేది. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోగ్రఫీ అనేది మరిత సులభతరంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ఆవిర్భావంతో కెమెరా టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.

Read More : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 వచ్చేసింది, ఇవే ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్ట్ ఆఫ్ ఫోకసింగ్..

ఆర్ట్ ఆఫ్ ఫోకసింగ్ అనేది ఫోటోగ్రఫీలో ముఖ్యమైన అంశం. ఈ నైపుణ్యాన్ని బట్టే ఫోటోగ్రాఫర్ టాలెంట్‌ను అంచనా వేయటం జరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో అన్ని స్మార్ట్ ఫోన్ కెమెరాలలో ఆటో ఫోకస్ ఫీచర్ ను ఇన్ బిల్ట్ గా అందించటం జరుగుతోంది. ఆటో ఫోకస్ అంటే ఏంటి..?, ఈ ఫీచర్ వల్ల ప్రధానంగా చేకూరే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పాసివ్, యాక్టివ్

ఆటో ఫోకస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది పాసివ్, రెండవది యాక్టివ్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడ్రన్ కెమెరాలో పాసివ్ ఆటో ఫోకస్‌ను ఉపయోగిస్తున్నారు. పాసివ్ ఆటోఫోకస్‌ అనేది కెమెరాలోని ఫేస్‌ డిటెక్షన్ ఆటోఫోకస్ అలానే కాంట్రాస్ట్ సెన్సార్లను ఉపయోగించుకుని సబ్జెక్ట్స్ మధ్య దూరాన్ని అంచనా వేస్తుంది. తద్వారా ఫోకసింగ్ మొత్తం సబ్జెక్ట్ మీద కేంద్రీకృతమవుతుంది.

సింగిల్ ఆటో ఫోకసింగ్ మోడ్

కానన్, నికాన్ వంటి కంపెనీలు సింగిల్ ఆటోఫోకస్ ఫీచర్‌ను రకరకాల పేర్లతో అందిస్తున్నాయి. వన్‌షాట్ ఆటో ఫోకస్ పేరుతో కానన్, AF-S పేరుతో నికాన్ సంస్ధలు ఆటో ఫోకస్ మోడ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. కెమెరాలో సింగిల్ ఆటో ఫోకసింగ్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకున్నట్లయితే, సబ్జెక్ట్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా ఫోకస్ అనేది లాక్ అయిపోతుంది.

కంటిన్యూస్ ఆటోఫోకస్

కంటిన్యూస్ ఆటోఫోకస్ అనేది సింగిల్ ఆటోఫోకస్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కంటిన్యూస్ ఆటోఫోకస్ మోడ్ అనేక మోషన్‌లను ఉపయోగించుకుని ఫ్రేమ్‌లోని సబ్జెక్ట్‌ను బట్టి ఫోకస్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. స్పోర్ట్స్ టోర్నమెంట్స్‌లో ఫోటోలను క్యాప్చుర్ చేసుకునేందుకు ఈ మోడ్‌ను ఎక్కువుగా వినియోగిస్తుంటారు.

హైబ్రీడ్ ఆటో ఫోకస్

హైబ్రీడ్ ఆటోఫోకస్ అనేది సింగిల్ ఆటోఫోకస్, కంటిన్యూస్ ఆటోఫోకస్‌లతో పోలిస్తే అదనపు ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ మోడ్‌లో సబ్జెక్ట్‌ను సెలక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమెటిక్‌గా ఫోకస్ అనేది లాక్ అయిపోతుంది. సబ్జెట్‌లో అనుకోకుండా ఏమైనా కదలికలు తలెత్తినట్లయితే ఫోకస్ మరోసారి అడ్జస్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
All you need to know about AutoFocus and its modes. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot