రఫ్ అండ్ టఫ్ ఫోటోగ్రఫీ!

By Prashanth
|
Camcorder models from Samsung


మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ పరికరాల తయారీ విభాగాల్లో విశేష సేవలందిస్తున్న సామ్‌సంగ్ ఫోటోగ్రఫీ రంగంలోనూ తన సత్తాను చాటేందుకు సన్నద్దమైంది. తాజాగా ఈ బ్రాండ్ 5 మోడళ్లలో వాటర్‌ప్రూఫ్ క్యామ్‌కార్డర్లను డిజైన్ చేసినట్లు తెలిసింది. QF20, W300, F80, Q20, W350 నమూనాలలో రూపుదిద్దకున్న ఈ కెమెరాలు రఫ్ అండ్ టఫ్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడతాయి. వీటిలో QF20, W300 మోడళ్లు యూఎస్ మార్కెట్లో త్వరలో లభ్యం కానున్నాయి.

సామ్‌సంగ్ క్యూఎఫ్20 కీలక ఫీచర్లు:

20x ఆప్టికల్ జూమ్, 40x డిజిటల్ జూమ్, సీఎమ్‌వోఎస్ సెన్సార్, 0.25 అంగుళాల ఇమేజ్ సెన్సార్, ఆటో ఫోకస్, స్టిల్‌ఇమేజ్ సపోర్ట్, రిసల్యూషన్ 5.3మెగా పిక్సల్స్, హెచ్‌డిఎమ్ఐ అవుట్, యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, ఫోకల్ లెంగ్త్ 2.6 – 52ఎమ్ఎమ్, 2.7 అంగుళాల టచ్ స్ర్కీన్, ఎస్డీకార్డ్ సపోర్ట్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, OIS Duo సపోర్ట్, ధర రూ.18,000.

ఆడ్వాన్సుడ్ వైర్‌లెస్ ఫీచర్ సౌలభ్యతతో క్యామ్ కార్డర్‌లోని ఫోటోలు అదేవిధంగా వీడియోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి సులువుగా షేర్ చేసుకోవచ్చు. ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని యూజర్ ఈ డివైజ్ నుంచి ఆశించవచ్చు. క్యామ్‌కార్డర్‌లో ఏర్పాటు చేసిన హైక్వాలిటీ సిఎమ్‌వోఎస్ సెన్సార్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన ఫోటోలను విడుదల చేస్తుంది.

సామ్ సంగ్ W300 ఫీచర్లు:

డస్ట్‌ఫ్రూఫ్, 15 అడుగుల వాటర్ ప్రూఫింగ్, 6 అడుగుల షాక్ ప్రూఫింగ్, సిఎమ్‌వోఎస్ సెన్సార్, 5 మెగా పిక్సల్ రిసల్యూషన్, 2.7 అంగుళాల స్ర్కీన్ సైజ్, ఫోకల్ లెంగ్త్ 29.6ఎమ్ఎమ్, ఎస్డీ‌కార్డ్ సపోర్ట్, వీడియో అవుట్ సౌలభ్యత, యూఎస్బీ సపోర్ట్, ధర అంచనా రూ.8,000 కఠిన వాతావరణాల్లో సైతం ఈ మల్టీ‌ప్రూఫ్ క్యామ్‌కార్డర్ సమర్థవంతంగా పని చేస్తుంది. ఫోటోలను ఎడిట్ చేసుకునే విధంగా అత్యుత్తమ క్రియోటివ్ ఎడిటింగ్ ఫీచర్లను క్యామ్‌లో నిక్షిప్తం చేశారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X