Home
Camera

సముద్రంలో పోయిన కెమెరా, 2 ఏళ్ల తరువాత దొరికింది, పనితీరు అద్భుతం

ఇది నిజంగా చాలా విచిత్రకరమైన సంఘటన, మాములుగా మీరు ఏదైనా విహార యాత్ర కోసం సముద్రంలో లోకి వెళ్లినప్పుడు ఏదైనా వస్తువు పొరపాటున సముద్రంలో పడిపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందే.

By Hazarath Aiah

ఇది నిజంగా చాలా విచిత్రకరమైన సంఘటన, మాములుగా మీరు ఏదైనా విహార యాత్ర కోసం సముద్రంలో లోకి వెళ్లినప్పుడు ఏదైనా వస్తువు పొరపాటున సముద్రంలో పడిపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే అది రెండేళ్ల తరువాత దొరికితే ఎలా ఉంటుంది. అలాగే అది పనిచేస్తుంటే ఇంకెలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓయువతికి ఎదురయింది. జపాన్‌ కు చెందిన సెరేనా సుబాకిహర అనే యువతి విజ్ఞానయాత్రలో భాగంగా సముద్రయానం చేస్తూ, ఫొటోలు తీస్తున్న సమయంలో పొరపాటున ఆమె కెమెరా సముద్రంలో పడిపోయింది. తనెంతో ఇష్టపడి తీసిన ఫొటోలతో పాటు కెమెరా పడిపోవడంతో తన విజ్ఞానయాత్రకు సంబంధించిన తీపి జ్ఞాపకాలు పోయాయని బాధపడింది. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయింది.

Canon PowerShot G12 camera

ఇది జరిగిన రెండేళ్ల తరువాత సోషల్ మీడియాలో సముద్రపు ఒడ్డును క్లీన్ చేస్తుండగా దొరికిన పాచిపట్టిన కెమెరాను పరిశీలిస్తున్న తైవాన్ విద్యార్థిని ఫొటో ఆమెను ఆకట్టుకుంది. దానిని పార్క్‌ లీ అనే ఉపాధ్యాయురాలు పోస్టు చేసింది. విద్యార్థులకు దొరికిన ఆ కెమెరా పని చేస్తోందని, సముద్ర జలాల్లో పడిపోయినా సాధారణంగా పనిచేస్తున్న ఆ కెమెరాను చూసి ఆశ్చర్యపోయామంటూ ఆమె పోస్టులో పేర్కొన్నారు.ఆ కెమెరా తనదే అని గుర్తించిన సెరేనా, పార్క్ లీని సంప్రదించి, ఆ కెమెరా తనదేనని చెప్పింది. ఆ కెమెరాతో చివరి సారిగా తాను 2015 సెప్టెంబరు 7న జపాన్‌ లోని ఒకినావా ప్రాంతంలోని ఇషిగాకి ఐలాండ్‌ ఫొటోను తీసినట్లు వివరించింది.

దీంతో ఆ కెమెరా ఆమెదేనని నిర్ధారించిన పార్క్ లీ ఆమెకు దానిని పంపించారు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన సెరేనా... 'ప్రపంచం చాలా విచిత్రమైంది. రెండేళ్ల తర్వాత నా కెమెరాను నాకు అందించింది. అన్నింటికంటే వింత ఏంటంటే అది ఇప్పటికీ బాగా పనిచేస్తోంది' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి, పార్క్‌ లీ, పాఠశాల విద్యార్థులకు, నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకీ ఆ కెమెరా పేరు చెప్పనేలేదుగా Canon PowerShot G12 camera అది. ఈ విషయాన్ని బిబిసి రిపోర్ట్ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Camera lost at sea for two years reunited with its owner after Facebook post More news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X