కానోన్ ‘ద బెస్ట్ కెమెరా బ్రాండ్’!!!

Posted By: Prashanth

కానోన్ ‘ద బెస్ట్ కెమెరా బ్రాండ్’!!!

 

అంతర్జాతీయ కెమెరా గ్యాడ్జెట్‌ల విభాగంలో విశేష ప్రజాదరణను సొంతం చేసుకున్న కానోన్ (Canon) నాణ్యతతో పాటు సమర్ధతకు పెద్దపీట వేస్తూ వినియోగదారుల ఆదరణను చొరగుంటుంది. నిపుణులచే ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ఈ బ్రాండ్ సరికొత్త ఫుల్ ఫ్రేమ్ కెమెరాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘నికాన్ డి800’కెమెరా లాంఛ్ అనంతరం ఈ ఆవిష్కరణ ఉంటుందని కానోన్ వర్గాలు ఒక ప్రకటనలో ప్రకటించాయి.

ఈ డివైజ్‌కు ‘Canon EOS 5D Mark III’గా నామకరణం చేసినట్లు పుకార్లు వ్యక్తమవుతున్నాయి. ‘EOS 5D Mark II’ను భర్తీ చేస్తూ ఈ అపడేటెడ్ డివైజ్‌ను వృద్థి చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. జపాన్, థాయిలాండ్ ప్రాంతాల్లో నిరుడు ముంచెత్తిన వరదలు దాటికి కానోన్ స్వల్ప నష్టాలను చవి చూసింది.

ఈ కెమెరా ఊహాజనిత ఫీచర్లు:

* డివైజ్ లో 21.1 లేదా 28 మెగా పిక్సల్ ఫుల్‌ఫ్రేమ్ సీఎమ్‌వోఎస్ సెన్సార్‌ను పొందుపరచవచ్చు,

* డ్యూయల్ డిజిక్ 5 లేదా డిజక్ 4 ప్రాసెసర్,

* ఆటో ఫోకస్ కంట్రోల్,

* లో నాయిస్ ఐఎస్ఓ సెన్సిటివిటీ,

* 63- సెగ్మంట్ మీటరింగ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot