కానన్ కొత్త శ్రేణి డిఎస్ఎల్ఆర్ కెమెరా!!

By Prashanth
|
Canon


ఈ మార్చితో కానన్ మరో మైలు రాయిని దిగ్విజయంగా అధిరోహించింది. కంపెనీ తొలిగా రూపొందించిన ‘EOS SLR’ కెమెరాకు ఈ ఏడాది మార్చితో 25 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ నేపధ్యంలో కానన్ తన డిఎస్ఎల్ఆర్ లైన్‌ప్ నుంచి ఉత్తమ శ్రేణి కెమెరాను రూపొందించింది. ‘EOS 5D Mark III’ మోడల్లో వస్తున్న ఈ కెమెరా పూర్తి స్ధాయి ప్రొఫెషనల్ హోదాను కలిగి ఉంటుంది. కెమెరా కీలక స్పెసిఫికేషన్‌లు:

* 3.2 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే.

* డ్యూయల్ మెమెరీ ఎస్డీ మరియు కాంపాక్ట్ ఫ్లాస్.

* మన్నికైన 14 బిట్ డిజిక్ 5+ ప్రాసెసర్‌ను కెమెరాలో ఏర్పాటు చేశారు.

* 22.3 మెగా పిక్సల్ ఫుల్ ఫ్రేమ్ సిఎమ్‌వోఎస్ సెన్సార్, 61 పాయింట్ రెటికులర్ ఆటోఫోకస్ తో.

* ISO పరిధి 50 నుంచి 102,400 వరకు,

* 1080 పిక్సల్ రిసల్యూషన్ తో వీడియోలను రికార్డ్ చేసుకునే సౌలభ్యత,

* హెడ్‌ఫోన్ జాక్ సౌలభ్యత,

* ప్రతికూల వాతవరణాల్లో కెమెరా చెక్కుచెదరకుండా పని చేసే విధంగా డస్ట్ ప్రూఫ్ వ్యవస్థ,

* వివిధ యాంగిల్స్‌లో ఫోటోలను చిత్రీకరించేందుకు గాను పలు క్రియేటివ్ ఆప్షన్‌లను కెమెరాలో లోడ్ చేశారు.

మార్చి చివరాకరి నుంచి ఈ ఉత్తమ క్వాలిటీ కెమెరాలు మార్కెట్లో లభ్యంకానున్నాయి. ధర అంచనా రూ.1,75,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X