ఇంకా నెల వెయిట్ చెయ్యండి..!

Posted By: Staff

ఇంకా నెల వెయిట్ చెయ్యండి..!

 

కానన్ అభిమానులకు మరో నెల పాటు నిరీక్షణ తప్పదు. ఈ ప్రముఖ కెమెరాల తయారీ బ్రాండ్ ఇటీవల కాలంలో ‘కానన్ EOS-1DX’ మోడల్‌లో ఫుల్ ఫ్రేమ్ డిజిటల్ సింగిల్ లెన్స్ కెమెరాను రూపొందించిన విషయం తెలిసిందే. కంపెనీ ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ కెమెరా మార్చిలో విడుదల కావల్సి ఉంది. అయితే పలు సాంకేతిక సమస్యలు తలెత్తటంతో విడుదల సయమాన్ని మరో నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

కెమెరా ఫీచర్లను పరిశీలిస్తే:

* 18 మెగా పిక్సల్ రిసల్యూషన్ సెన్సార్,

* డ్యూయల్ డిజిక్ 5+ ఇమేజ్ ప్రాసెసర్,

* 1,00,000పిక్సల్ డిటెక్షన్,

* రెడ్, గ్రీన్, బ్లూ (ఆర్‌జి‌బి) మానిటరింగ్,

* ఆటో ఫోకస్,

* వైడ్ ఏరియా మోడ్ (61 ఫోకస్ పాయింట్స్),

* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

కానన్ EOS-1D సిరీస్ నుంచి 10వ వర్షన్ కెమెరాగా వస్తున్న ఈ డివైజ్ ఆధునిక స్పెసిఫికేషన్‌లతో ఇప్పటికే వినియోగదారుల అంచనాలను పెంచింది. ఏర్పాటు చేసిన హై రిసల్యూషన్ సెన్సార్ వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోలను బంధిస్తుంది. 1920 x 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot