కానోన్ లేటెస్ట్ పవర్ షాట్ కెమెరాస్!!

Posted By: Staff

కానోన్ లేటెస్ట్ పవర్ షాట్ కెమెరాస్!!

 

పవర్ షాట్ సిరీస్‌లో రెండు సరికొత్త కెమెరాలను ప్రవేశపెడుతున్నట్లు కానోన్ ప్రకటించింది. ఇంటిలిజెంట్ ఐఎస్ ఫీచర్‌గా పిలవబడే అత్యాధునిక ఆటోమేటెడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వ్యవస్థను ఈ కెమెరాలలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. పవర్ షాట్ ఇల్ఫ్ 520 HS, పవర్ షాట్ ఇల్ఫ్ 110 HS మోడల్స్‌లో వస్తున్న ఈ కెమెరాల ఫీచర్లను పరిశీలిద్దాం...

పవర్ షాట్ ఇల్ఫ్ 520 HS:

ఇల్ఫ్ 500 HSకు వారసుడిగా వస్తున్న ఈ కెమెరా స్టోరేజి వ్యవస్థ మైక్రో‌ఎస్డీ కార్డ్స్ రూపంలో ఉంటుంది. కెమెరా మందం 0.88 అంగుళాలు మాత్రమే. 10 మెగా పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన సీఎమ్‌వోఎస్ సెన్సార్ వ్యవస్థ కెమెరాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెమెరా జూమ్ పరిమితి 28 mm నుంచి 336 mm వరకు ఉంటుంది. ఈ కెమెరా ద్వారా వీడియోలను 1080 పిక్సల్ రిసల్యూషన్ తో చిత్రీకరించుకోవచ్చు, సెకనుకు 24 ఫ్రేమ్స్ వేగం. కెమెరా ఎల్‌సీడీ స్ర్కీన్ 3 అంగుళాల పరిమాణం కలిగి ఉంటుంది. స్టీరియో ఆడియోను ఈ డివైజ్ రికార్ఢ్ చేస్తుంది. ధర రూ.15,500.

పవర్ షాట్ ఇల్ఫ్ 110 HS:

* 16 మెగా పిక్సల్ ఇమేజ్ రిసల్యూషన్, * డిజిక్ 5 ఇమేజ్ ప్రాసెసర్, * 5X జూమ్, * 26 సీన్ మోడ్స్, * ధర రూ.13,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot