అల్ట్రా మోడ్రెన్ ఫీచర్లతో కానన్ కొత్త కెమెరా ..

Posted By: Prashanth

అల్ట్రా మోడ్రెన్ ఫీచర్లతో కానన్ కొత్త కెమెరా ..

 

ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ కానన్, మరో కొత్త కెమెరాను లాంఛ్ చేసింది. ‘IXUS 1100 HS’ వస్తున్న ఈ డివైజ్ ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన ప్రధాన ఫీచర్ హెచ్ఎస్ సిస్టంతో అన్ని రకాలైన వెలుతురు పరిస్ధితులలో సైతం క్వాలిటీతో కూడిన చిత్రాలను షూట్ చేయ్యవచ్చు. కొత్తగా ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న వారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక. వీరి కోసం కెమెరా వాడుకకు సంబంధించి వివరాలతో కూడిన ప్రత్యేక సీడీని రూపొందించారు. సిల్వర్, రెడ్ , బ్లాక్ కలర్ వేరియంట్‌లలో కెమెరా లభ్యం కానుంది. పొందుపరిచిన టచ్ స్ర్కీన్ వ్యవస్థ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

కెమెరాలోని ముఖ్య విశేషాలు:

* బరువు కేవలం 206గ్రాములు,

* భిన్నమైన కోణాల్లో ఫోటోలు తీసుకునేందుకు క్రియేటివ్ మోడ్స్,

* ఐఫ్రేమ్ మూవీ అప్లికేషన్,

* సూపర్ స్లో మోషన్ మూవీ,

* మూవీ డైజెస్ట్,

* కలర్ II టచ్ LCD,

* 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్,

* డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసర్,

* 12.1 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్,

* అవుట్ పుట్ రిసల్యూషన్ 12 మెగా పిక్సల్,

* ISO 100-3200,

* షిప్ట్ టైప్ లెన్స్, ఆటో ఫోకస్,

* యూఎస్బీ కనెక్టువిటీ,

* రీఛార్జబుల్ బ్యాటరీ,

* ధర అంచనా రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot