Canon కొత్త పోర్టబుల్ కెమెరా.. వ్లాగింగ్ చేసే వారికోసం ప్రత్యేకంగా విడుదల
అత్యుత్తమ కెమెరాలు తయారుచేసే ప్రముఖ సంస్థల్లో కెనాన్ ఒకటి. ఈ సంస్థ సుమారు అన్ని రేంజ్‌ల్లో కెమెరాలను లాంచ్ చేస్తుంటుంది. అయితే తాజాగా కెనాన్ సంస్థ ప్రత్యేకంగా వ్లాగింగ్ కోసం ఓ కెమెరాను లాంచ్ చేసింది. ఈ కెమెరా ఫీచర్లు, ధర ఇతర వివరాలు మీకోసం..
Canon Powershot V10 పేరుతో తీసుకొచ్చిన కెమెరా వ్లాగింగ్ చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందని వెల్లడించింది. ఈ కెమెరా కేవలం 211 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. జేబులో పెట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని సంస్థ తెలిపింది. పవర్‌షాట్ V10 కెమెరాలో అత్యంత నాణ్యమైన మైక్రోఫోన్‌ను ఉంటుంది. కెమెరాతోపాటు స్టాండ్ వస్తుంది. ఎటువంటి షేకింగ్ లేకుండా బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌తో ప్రొఫెషనల్‌గా 4K UHD వీడియోలను రికార్డు చేసుకోవచ్చని కెనాన్ పేర్కొంది.

పవర్‌షాట్ V10 కెమెరా వర్టికల్ బాడీని కలిగి ఉంటుందని, ఇది సంస్థ యొక్క కొత్త డిజైన్ అని కెనాన్ తెలిపింది. ఈ కెమెరా పోర్టబుల్‌గా ఉంటుందని.. ఎటువంటి రద్దీ ప్రాంతాల్లోనైనా సొంతంగా వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చని పేర్కొంది. కెమెరా మధ్యలో ఏర్పాటుచేసిన బటన్‌తో.. ఒక్క చేతితోనే కెమెరాను నియంత్రించవచ్చని వెల్లడించింది. ఈ కెమెరాకు 2.0 అంగుళాల LCD టచ్‌స్ర్కీన్ ఉంటుంది. ఈ స్ర్కీన్‌ను ముందువైపునకు ప్లీప్ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
కెనాన్ పవర్‌షాట్ V10 కెమెరా.. ఒక్క అంగుళం CMOS సెన్సార్ కలిగి ఉంటుంది. దీంతో 4K వీడియో నాణ్యతను అందించగలదు. స్టిల్ షూటింగ్ సామర్థ్యాలను అందించగలదు. ఈ కెమెరాలో అందుబాటులో ఉన్న 14 రంగుల ఫిల్టర్ ఎఫెక్ట్‌లు మరియు స్మూత్ స్కి్న్ మోడ్‌ను వేగంగా మార్చుకొనే వీలుంటుందని కెనాన్ వెల్లడించింది.
ఈ కెమెరాలో ఆడియో రికార్డ్ చేసేందుకు రెండు పెద్ద స్టీరియో మైక్రోఫోన్‌లు ఉంటాయి. మరోకటి ఆడియో నాయిస్ రిడక్షన్ మైక్రోఫోన్ ఉంటుంది. బహిరంగ ప్రాంతాల్లో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో నాణ్యతను మరింత మెరుగు పరుచుకొనేందుకు విండ్‌షీల్డ్‌ను కొనుగోలు చేసుకోవచ్చని కెనాన్ సూచించింది.
పవర్‌షాట్ V10.. కెనాన్ కెమెరా కనెక్ట్ యాప్‌తో లింక్ చేయవచ్చు. ఫలితంగా కెమెరాలో ఉన్న ఫోటోలు, వీడియోలను వైఫై ద్వారా సులభంగా స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొనేందుకు వీలు ఉంటుంది. వీటితో పాటు పవర్‌షాట్ V10లోని HDMI మరియు USB పోర్ట్‌లతో ల్యాప్‌ట్యాప్ లేదా కంప్యూటర్‌లోనికి డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
కెనాన్ పవర్‌షాట్ V10 కెమెరా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒకటి స్టాండర్డ్ కిట్.. ఇందులో పవర్ కేబుల్, సాఫ్ట్ కేస్, లెన్స్ క్యాప్, విండ్‌షీల్డ్, రిస్ట్ స్ట్రాప్ ఉంటాయి. మరింత సృజనాత్మకతను కోరుకొనే వారి కోసం అడ్వాన్స్‌డ్ కిట్ ఉంటుంది. రింగ్ లైట్ లేదా అదనపు మైక్రోఫోన్‌ను అమర్చేందుకు వీలుగా కేజ్ ఉంటుంది.
భారత్‌లో కెనాన్ పవర్‌షాట్ V10 ధర రూ.39,995 వద్ద లాంచ్ అయింది. జూన్ 2023 నుంచి ఈ కెమెరా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అప్పటి నుంచి కెనాన్ స్టోర్ నుంచి గానీ లేదా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








