రోజువారి ఫోటోగ్రఫీ కోసం కానోన్ పవర్ షాట్!!!

Posted By: Prashanth

రోజువారి ఫోటోగ్రఫీ కోసం కానోన్ పవర్ షాట్!!!

 

రోజువారి ఫోటోగ్రఫీ కోసం కానోన్ (Canon) ఓ ఉత్తమ కెమెరాను డిజైన్ చేసింది. కానోన్ పవర్ షాట్ లైనప్ నుంచి వస్తున్న ఈ కెమెరా ఆధునిక టెక్నాలజీని ఒదిగి ఉండటంతో పాటు సులువైన ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. బ్లాక్, పింక్, గ్రే, బ్లూ, మరోన్ వంటి కూల్ కలర్స్‌లో ఈ డివైజ్ లభ్యమవుతుంది. ‘పవర్ షాట్ A3300 IS’గా వస్తున్న ఈ స్మార్ట్ డిజిటల్ కెమెరా ఫోటోగ్రఫీలోని మెళుకువలను సులువైన కోణంలో నేర్పుతుంది.

డివైజ్ ఫీచర్లు:

* డిజిక్ 4 ప్రాసెసర్,

* 16 మెగా పిక్సల్ సెన్సార్,

* 28ఎమ్ఎమ్ లెన్స్,

* షట్టర్ స్పీడ్ 15-1/1600,

* 3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,

* 5xఆప్టికల్ జూమ్,

* ఐఎస్‌వో పరిమితి 80-1600,

* 720పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* మల్టీపుల్ టైప్ మెమెరీ కార్డ్ సపోర్ట్,,

* ఇమేజ్ స్టెబిలైజర్,

* 4x డిజిటల్ జూమ్,

మన్నికైన ఫోటోగ్రఫీకి తోడ్పడే ఈ డివైజ్ బరువు 149 గ్రాములు. వీడియోలను ఉత్తమ క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఫోటో ఇమేజ్ క్వాలిటీ మిమ్మల్ని సంతృప్తికి లోను చేస్తుంది. కేవలం రెండు సెకన్ల వ్యవధిలో కెమెరా పవన్ ఆన్ అవుతుంది. పొందుపరిచిన 3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ ఇమెజ్ కోణాన్ని స్పష్టం చేస్తుంది. రెండు సంవత్సరాల వారంటీతో ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యమవుతున్న ‘కానోన్ పవర్ షాట్ A3300 IS’ ధర రూ.8,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot