కానన్ పవర్ షాట్ డిజిటల్ కెమెరా!!

Posted By: Staff

కానన్ పవర్ షాట్ డిజిటల్ కెమెరా!!

 

కెమెరాల తయారీ కంపెనీ కానన్ తన పవర్‌షాట్ సిరీస్ నుంచి మరో అత్యుత్తమ డిజిటల్ కెమెరాలను లాంఛ్ చేసింది. ప్రపంచపు పలచటి కెమెరాగా గుర్తింపు తెచ్చుకన్న ఈ డివైజ్ 5ఎక్స్ జూమ్ ఆప్టికల్ లెన్స్‌ను కలిగి ఉంది. వినియోగదారుడు చెల్లించిన మొత్తానికి పూర్తి భరోసాను ఈ కెమెరా కల్పిస్తుంది. కానన్ పవర్‌షాట్ లైనప్ నుంచి ELPH 300HS మోడల్‌లో వస్తున్న ఈ డివైజ్ ఇతర ఫీచర్ల పనితీరు క్లుప్తంగా ...

కెమెరాలో నిక్షిప్తం చేసిన 12.1 మెగాపిక్సల్ సీసీడి ఇమేజ్ సెన్సార్ మరియు డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసింగ్ వ్యవస్థలు ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలను ఉత్పత్తి చేస్తాయి. ఏర్పాటు చేసిన 5ఎక్స్ జూమ్ 24ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ సుదూర చిత్రాలను క్వాలిటీతో క్యాప్చుర్ చేస్తాయి. పొందుపరిచిన హై డెఫినిషన్ వ్యవస్థ ద్వారా వీడియోలను 1080 పిక్సల్ క్లారిటీతో రికార్డ్ చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన హెచ్‌డిఎమ్‌ఐ కనెక్టువిటీ సౌలభ్యతతో కెమెరాను హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు. బరువు 141 గ్రాములు. కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 2.7 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ ఫోటో యాంగిల్‌ను స్పష్టం చేస్తుంది. నిక్షిప్తం చేసిన 32 స్మార్ట్ ఆటో సీన్ మోడ్స్ చిత్రాలను భిన్నంగా షూట్ చేసేందుకు తోడ్పడతాయి. ఇండియన్ మార్కెట్లో కానన్ పవర్‌షాట్ ELPG 300HS కెమెరా అంచనా ధర రూ.15,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting