ఫెస్టివల్ ఆఫర్: కానన్ కెమెరాల పై 11,000 ధర తగ్గింపు!

Posted By: Super

ఫెస్టివల్ ఆఫర్: కానన్ కెమెరాల పై 11,000 ధర తగ్గింపు!

 

 

అంతర్జాతీయ ఫోటో కెమెరా తయరీ బ్రాండ్ కానన్ (canon) భారత్‌లో పండు సీజన్‌ను పురస్కరించిన ధర తగ్గింపు ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పలు రకాల కెమెరా మోడల్స్ పై ధరలను దాదాపు రూ.11,000 వరకు తగ్గిస్తున్నట్లు కానన్ ఇండియా బుధవారం ఒక ప్రకటనలో తెలపింది. అదేవిధంగా బ్రాండ్ మార్కెటింగ్, ప్రమోషన్ కార్యకలాపాల నిమిత్తం ఈ ఏడాది రూ.142కోట్లును వెచ్చించనున్నట్లు  పేర్కొంది. ఈ ధర తగ్గింపు ఆఫర్ 13 డిజిటల్ కెమెరాలు అలాగే మూడు డీఎస్ఎల్ఆర్ కెమెరాల పై వర్తిస్తుంది. వీటిలో రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.11,000 ధర తగ్గింపు ఉంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను 32 శాతం వృద్ధితో రూ.2,100 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కానన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ భరద్వాజ్ ఈ సందర్భంగా తెలిపారు. మార్కెట్లోకి కొత్త రెండు డిజిటల్ కెమెరాలను ప్రవేశపెట్టటంతో పాటు తమ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్స్ సంఖ్యను 75నుంచి 100కు పెంచుకోనున్నట్లు భరద్వాజ్  వెల్లడించారు.

కానన్ పవర్ షాట్ డీ20:

ప్రముఖ ఫోటోకెమెరాల తయారీ సంస్థ కానన్ పవర్ షాట్ డీ20 పేరుతో వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను డిజైన్ చేసింది. 12 మెగా పిక్సల్ హై‌సెన్సిటివిటీ సీఎమ్‌వోఎస్ సెన్సార్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ పాయింట్ షూట్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని ఉత్పత్తి చేస్తుంది. వినియోగించిన డిజిక్ 4 ఇమేజ్ ప్రాసెసర్ కెమెరా ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది.

వాటర్‌ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ కెమెరాను వర్షంలో సైతం ఉపయోగించుకోవచ్చు. కెమెరా 33 అడుగుల లోతైన నీటిలో పడినప్పటికి చెక్కు చెదరకుండా పని చేస్తుంది. నిక్షిప్తం చేసిన టీటీఎలం ఆటోఫోకస్ సిస్టం షూటింగ్ ఫోకస్‌ను రెట్టింపు చేస్తుంది. ఏర్పాటు చేసిన 25ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్ 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంటాయి.

24 ఫ్రేమ్స్ ఫర్ సెకన్ వేగంతో హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. హెచ్‌డిఎమ్ఐ అవుట్‌పుట్ పోర్ట్ సౌలభ్యతతో డివైజ్‌ను హై డెఫినిషన్ పరికరాలకు జత చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 3 అంగుళాల ప్యూర్ కలర్ సిస్టం ఎల్‌‍సీడీ స్ర్కీన్ ఫోటో కోణాన్ని స్పష్టంగా చూపుతుంది. ఎస్‌డి, ఎస్‌డిహెచ్‌సీ, ఎస్‌డీఎక్స్‌సీ మెమరీ కార్డుల సౌలభ్యతతో కెమెరా స్టోరేజ్ సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు. మార్కెట్లో కానన్ పవర్ షాట్ డీ20 డిజిటల్ కెమెరా ధర అంచనా రూ.18,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot