ఆకాశ వీధుల్లో అదరగొట్టే పోటోగ్రఫీ.. !!

Posted By: Super

ఆకాశ వీధుల్లో అదరగొట్టే పోటోగ్రఫీ.. !!

ప్రముఖ ఫోటో కెమెరాల నిర్మాణ సంస్థ కానన్ ఇవోఎస్ 20డీఏ డిజిటల్ ఎస్ఎల్‌ఆర్‌కు కొనసాగింగపు మోడల్‌గా 60డీఏ డిఎస్ఎల్ఆర్ కెమెరాను రూపొందించింది. ఈ కెమెరా నుంచి రాత్రుళ్లు సైతం ఉత్తమ క్వాలిటీ  ఫోటోగ్రఫీని ఆశించవచ్చు.

ఈ కెమెరా‌లో నిక్షిప్తం చేసిన మాడిఫైడ్ ఇన్‌ఫ్రా రెడ్‌ఫిల్టర్ అదేవిధంగా లోనాయిస్ సెన్సార్ వ్యవస్థలు ఫోటోలను ఖచ్చితమైన సమచారంతో చిత్రీకరిస్తాయి. ఇన్‌ఫ్రా‌రెడ్  బ్లాకింగ్ ఫిల్టర్ వ్యవస్థ సాధారణ కానన్ డిజిటల్ ఎస్‌ఎల్‌ఆర్ క్యామ్‌కు మూడు రెట్టు అధికంగా హైడ్రోజన్ ఆల్పా లైట్ సాంధ్రతను కలిగి ఉంటుంది.

కెమెరా ముఖ్య ఫీచర్లు:

•  18 మోగా పిక్సల్ ఏపీఎస్- సీ సీఎమ్ వోఎస్ సెన్సార్,


•   3 అంగుళాల క్లియర్ వ్యూ ఎల్ సీడి స్ర్కీన్,


•   63 -జోన్ డ్యూయల్ లేయర్ మీటరింగ్ సిస్టం,


•   మాన్యువల్ కంట్రోల్,


•   హెచ్‌డిఎమ్ఐ పోర్టు,


•   హైడ్రోజన్ ఆల్ఫా  లైట్  సెన్సిటివిటీ,


•   ఇన్‌ఫ్రారెడ్ బ్లాకింగ్ ఫిల్టర్,


•   ఐఎస్‌వో సాంధ్రత 100 నంచి 6400 వరకు (దీనికి 12800 వరకు పెంచుకోవచ్చు),

పొందుపరిచిన 18 మెగా పిక్సల్ సిఎమ్‌వోఎస్ సెన్సార్ వ్యవస్థ షార్ప్ అదేవిధంగా హై క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించేందకు సహకరిస్తుంది.  ముఖ్యంగా ఆస్ట్ర్రానామికల్ వస్తువులను ఉత్తమ క్వాలిటీతో షూట్ చేసుకోవచ్పు. RAW, JPEG, RAW+JPEG వంటి భిన్న ఇమేజ్ ఫార్మాట్‌లను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. కెమెరాలో నిక్షిప్తం చేసిన మరో వినూత్న ఫీచర్ లైవ్ వ్యూ మోడ్. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో వినియోగదారు నిశబ్ధంగా ఫోటోలును చిత్రీకరించుకోవచ్చు.

కెమెరా వెనుక భాగంలో  అనుసంధానించిన 3 అంగుళాల ఎల్‌సీడి స్ర్కీన్ ఇమైజ్ క్లారిటీని స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో డిస్‌ప్లేను ఎడ్జస్ట్ చేసుకోవచ్చు. పొందుపరిచిన హెచ్‌డిఎమ్ఐ అవుట్ సౌలభ్యతతో  హైడెఫినిషన్ టీవీలకు కెమెరాను కేబుల్ సాయంతో జతచేసుకోవచ్చు. 9 రకాలైన ఆటో ఫోకస్ పాయింట్ల‌ను  డివైజ్ సపోర్ట్ చేస్తుంది.  పొందుపరిచిన ఆప్షనల్ రిమోట్ వ్యవస్థ అప్లికేషన్ సాయంతో కెమెరాను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

అంతరిక్ష పరిశోధకులు ఈ కెమెరా సాయంతో మరింత మెరుగైన సమాచారంతో కూడిన ఫోటోలను చిత్రీకరించుకోవచ్పు. ఏప్రిల్ చివరినాటికి  ఈ కెమెరా అందుబాటులోకి రానుంది. ధర విలువ రూ.75,000.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot