చూసే ప్రతిక్షణం ఆనంద భరితమే!

Posted By: Prashanth

చూసే ప్రతిక్షణం ఆనంద భరితమే!

 

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం Vu టెక్నాలజీస్ 3డి సౌలభ్యతలతో కూడిన సరికొత్త హైడెఫినిషన్ డిజిటల్ కెమెరాను డిజైన్ చేసింది. ఉన్నత శ్రేణి టెలివిజన్‌లు అదేవిధంగా డిస్‌ప్లే సొల్యూషన్‌లను రూపొందించటంలో ఈ బ్రాండ్ దిట్ట. తాజాగా ఈ సంస్థ రూపొందించిన 3డి ఫోటోగ్రఫీ కెమెరాను ఫోటోలు అదేవిధంగా వీడియోలు చిత్రీకరించేందుకు ఉపయోగించుకోవచ్చు. కెమెరాలో పొందుపరిచిన డ్యూయల్ లెన్స్-డ్యూయల్ సెన్సార్ టెక్నాలజీ ఉత్తమ శ్రేణి ఫోటోగ్రఫీని రియల్ టైమ్‌లో అందిస్తుంది. డివైజ్‌కు 3డి డిస్‌ప్లేను అనుసంధానించటంతో ఏ విధమైన కళ్లద్దాల సాయం లేకుండా కంటెంట్‌ను 3డి రూపంలో ఆస్వాదించవచ్చు.

కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో కలిసి విహారయాత్రలు, పార్టీలు తదితర ఉత్సాహభరిత సందర్భాల్లో ఈ కెమెరా మరింత ఉపయోగపడుతుంది. తక్కువ బరవు కలిగిన ఈ గ్యాడ్జెట్‌ను సౌకర్యవంతంగా క్యారీ చెయ్యవచ్చు. 3డీ అదేవిధంగా 2డీ మోడ్‌లను కెమెరాలో నిక్షిప్తం చేశారు. కావల్సిన ఆప్షన్‌ను అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. నలుపు రంగులో డిజైన్ కాబడిన ఈ కెమెరాను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని Vu స్టోర్‌లలో విక్రయిస్తున్నారు. ధర అంచనా రూ.19,900.

ఫుజి‌ఫిల్మ్ ఫైన్‌పిక్స్ FP170:

ఫోటో కెమెరా నిర్మాణ సంస్థ ఫుజిఫిల్మ్ సరికొత్త వాటర్‌ప్రూఫ్ డిజిటల్ కెమెరాను రూపొందించింది. మోడల్ ఫైన్‌పిక్స్ FP170. కొత్త జనరేషన్ ఫోటోగ్రఫీ విభాగంలో రాణించాలనుకునే యువతకు ఈ కెమెరా ఉత్తమ ఎంపిక. వైర్‌లెస్ ఫీచర్ ఆధారంగా ఈ డివైజ్‌లోని ఫోటోలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దుమ్ము, చమ్మ, వేడి వంటి ప్రతికూల పరిస్ధితులను ఫైన్ పిక్స్ FP170 సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

14 మెగా పిక్సల్ కెమరా సెన్సార్,

వాటర్ ప్రూఫ్ (33ఫీట్),

వైర్‌లెస్ ఇమేజ్ ట్రాన్సఫర్,

షాక్‌ఫ్రూఫ్ (6.5 అడుగులు),

ఫ్రీజ్‌ప్రూఫ్ (14డిగ్రీలు వరకు),

వీడియో రికార్డింగ్ సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot