మార్కెట్లోకి నికాన్ సరికొత్త కెమెరా...ధర రూ.20,950!

Posted By: Super

 మార్కెట్లోకి నికాన్ సరికొత్త కెమెరా...ధర రూ.20,950!

 

ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే సరికొత్త కూల్‌పిక్స్ శ్రేణి కెమెరాను ‘నికాన్’ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కెమెరా మోడల్  ‘కూల్ పిక్స్ ఎస్800సీ’. ధర రూ.20,950. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా స్పందించే ఈ తొలి కెమెరా అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభూతులను అందిస్తుంది.  మరోవైపు  సామ్‌సంగ్  ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే సరికొత్త ఆండ్రాయిడ్ కెమెరాను దీపావళి సీజన్‌ నాటికి అందుబాటులోకి తేనుంది.

కూల్‌పిక్స్ ఎస్800సీ కీలక ఫీచర్లు:

- 3.5 అంగుళాల WVGA OLED టచ్‌స్ర్కీన్,

-    ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం ( అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ ఐసీఎస్, జెల్లీబీన్),

- 16 మెగా పిక్సల్స్ బీఎస్ఐ సీఎమ్‌వోఎస్ సెన్సార్,

-    10ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,

-    18 ఫిల్టర్ ఎఫెక్ట్స్,

-    బ్లూటూత్,

-    యూఎస్బీ,

-    వై-ఫై కనెక్టువిటీ,

-    గూగుల్ ప్లే స్టోర్ అప్లికేషన్,

-    నికాన్ మై పిక్చర్ టౌన్ అప్లికేషన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot