Depth of Field ఫీచర్ గురించి పూర్తి సమాచారం

డ్యుయల్ కెమెరా స్మార్ట్‌‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో వాటిలోని ఫీచర్ల పై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ప్రముఖంగా Depth of Fie

|

డ్యుయల్ కెమెరా స్మార్ట్‌‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో వాటిలోని ఫీచర్ల పై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ప్రముఖంగా Depth of Field అనే ఫీచర్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.

Everything you need to know about Depth of Field

ఈ ఫీచర్, పాత కెమెరా టెక్నిక్కే అయినప్పటికి ఇటీవల కాలంలో లాంచ్ అయిన పలు డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫీచర్‌ను అర్థం చేసుకోవటం చాలా సులువే అయినప్పటికి, ప్రాక్టికల్‌గా వర్క్ అవుట్ చేయటానికి మాత్రం ఒక రోజు నుంచి రెండు రోజుల సమయం పడుతుంది.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ విభాగంలో కీలకం కాబోతోన్న Depth of Field ఫీచర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుందాం..

Depth of Field అంటే ఏంటి..?

Depth of Field అంటే ఏంటి..?

ఫోటోగ్రఫీకి సంబంధించి ముఖ్యమైన కాన్సెప్ట్‌లలో Depth of field (DoF) కాన్సెప్ట్ ఒకటి. ఫోటోగ్రాఫ్‌లో ఒక సబ్జెక్ట్‌ను మత్రమే షార్ప్ ఫోకస్‌తో హైలైట్ చేసి ఇతర ఎలిమెంట్‌లను బ్లర్ చేయటమనేది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫీచర్‌ను ఉపయోగించుకుని సీన్‌లోని ముఖ్యమైన ఎలిమెంట్స్‌ను మాత్రమే హైలైట్ చేస్తూ వీక్షకుడి దృష్టిని కట్టిపడేస్తున్నారు.

డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఫోటోగ్రఫీ పై పట్టు సాధించాలంటే, మనం వినియోగిస్తోన్న కెమెరాకు సంబంధించి Aperture settingతో పాటు లెన్స్‌కు సంబంధించిన focal length అలానే Subject Distance పై పూర్తి అవగాహన ఉండాలి.

Aperture అనేది చాలా కీలకం

Aperture అనేది చాలా కీలకం

డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను ప్రాధమికంగా నియంత్రంచే అంశాల్లో Aperture ఒకటి. కెమెరా సెట్టింగ్స్‌లో ఒకటైన అపెర్చుర్‌ను f-stop అని కూడా పిలుస్తారు. Apertures రేంజ్ f/1.8 నుంచి f/64 మధ్య ఉంటుంది. Aperture సెట్టింగ్ ద్వారా కెమెరా లెన్స్‌ను కావల్సిన విధంగా ఎడ్జస్ట్ చేసుకునే వీలుంటుంది. అపెర్చుర్‌ రేంజ్‌ను మార్చే కొద్ది కెమెరా లైటింగ్ మారుతుంటుంది.

Apertureకి, Depth of Fieldకి మధ్య రిలేషన్‌షిప్ ఏవిధంగా ఉంటుందంటే..?

కెమెరాకు కొన్ని గజాల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ నుంచి డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను రాబట్టాలంటే ఎక్కువ Aperture అవసరమవుతుంది. ఇదే సమయంలో ఎక్కువ లైట్ కూడా అవసరమవుతుంది. కొన్ని అంగుళాలు లేదా అడుగుల దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ నుంచి డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను రాబట్టాలంటే చాలా తక్కువ Aperture అవసరమవుతుంది. ఇక్కడ లైటింగ్ అనేది అంతగా అవసరం ఉండదు.

డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పై Lens Size ప్రభావం

డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను గుర్తించటంలో కెమెరా లెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 70mm నుంచి 300mm లెన్స్ మధ్య డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ పురోగతి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 70mm లెన్స్‌‌ను వినియోగించటం ద్వారా విస్తారమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ను రాబట్టవచ్చు.

100mm లెన్స్‌‌ను వినియోగించటం ద్వారా ఓ మోస్తరు డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ను రాబట్టే వీలుంటుంది. 200mm లెన్స్‌‌ను వినియోగించటం ద్వారా స్వల్పమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ను రాబట్టే వీలుంటుంది. 300mm లెన్స్‌‌ను వినియోగించటం ద్వారా అత్యంత స్వల్పంగా డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌. మాక్రో ఫోటోగ్రఫీకి ఈ తరహా డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ అవసరమవుతుంటుంది.

OnePlus 5: ఇది పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్OnePlus 5: ఇది పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్

 డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పై Subject Distance ప్రభావం

డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పై Subject Distance ప్రభావం

Aperture, Lens తరహాలోనే Subject Distance కూడా ఫోటోలోని డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను గుర్తించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫోటోలోని డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను రెండు రకాల క్వాలిటీలతో వర్ణించటం జరుగుతుంది. అందులో మొదటిది shallow DOFకాగా, రెండవది deep DOF. shallow డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌లో ఫోకస్ రేంజ్ అనేది కెమెరా పాయింట్‌కు కొన్ని అంగుళాలు లేదా కొన్ని అడుగుల దూరంలో ఉంటుంది.

deep డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌లో ఫోకస్ రేంజ్ అనేది కెమెరా పాయింట్‌కు కొన్ని గజాల దూరంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ రెండు రకాల ఫ్రేమ్‌లలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌‌ను ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఫోకస్ పాయింట్లతో కొలవటం జరుగుతుంది. ఉదాహరణకు మీ కెమెరాకు సబ్జెక్ట్‌కు మధ్య రెండు మీటర్ల దూరం ఉందనుకుందాం. 50mm లెన్స్‌ను ఉపయోగించుకుని f/2.8 అపెర్చుర్‌తో ఆ సబ్జెక్ట్‌ను మీరు షూట్ చేస్తున్నట్లయితే 10 సెంటీ‌మీటర్ల డెప్త్, మీ ఫోకస్‌కు లభిస్తుంది. ఇదే లెన్స్ అలానే అపెర్చుర్‌ను ఉపయోగించుకుని 10 మీటర్ల దూరంలోని సబ్జెక్ట్‌ను మీరు ఫోకస్ చేస్తున్నట్లయితే 100 సెంటీ‌మీటర్ల డెప్త్ మీకు లభిస్తుంది.

Best Mobiles in India

English summary
With the rise of dual camera modules in smartphones, there is a rise in Depth of Field feature as well. Check out here to know everything you need to know about Depth of Field.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X