ఇంకోటి రె‘ఢీ’..!!

Posted By: Prashanth

ఇంకోటి రె‘ఢీ’..!!

 

ప్రఖ్యాత కెమెరాల తయారీ కంపెనీ ఫుజిఫిల్మ్ తన ఫైన్‌పిక్స్ లైనప్ నుంచి మరో కెమెరాను తీసుకొచ్చింది. ఈ కొత్త కెమెరా పేరు ఫుజిఫిల్మ్ ఫైన్‌పిక్స్ AX550. ఈ సింపుల్ పాయింట్ కెమెరాలో పలు ఉపయుక్తమైన ఫీచర్లను లోడ్ చేశారు. కెమెరాలో నిక్షిప్తం చేసిన 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ సీసీడి ఇమేజ్ సెన్సార్ ఉత్తమ క్వాలిటీ పోటోగ్రఫీనందిస్తుంది. ఏర్పాటు చేసిన 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ వ్యవస్థ సుదూర చిత్రాలను మన్నికతో క్యాప్చుర్ చేస్తుంది. వెనక భాగంలో అమర్చిన 2.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫోటో కోణాన్ని స్పష్టం చేస్తుంది.

720 పిక్సల్ రిసల్యూషన్‌లతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్ మరియు ఆటోమెటిక్ సీన్ రికగ్నిషన్ వ్యవస్థలు కెమెరా పనితీరును మరింత బలోపేతం చేస్తాయి. డ్యూయల్ కలర్ వేరియంట్‌లో ఈ కెమెరా డిజైన్ కాబడింది. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot