రూ.5,999కే ఇన్‌స్టెంట్ ఫోటో కెమెరా

Fujifilm నుంచి సరికొత్త ఇన్‌స్టెంట్ ఫోటో కెమెరా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Instax Mini 9 పేరుతో విడుదలైన ఈ పోర్టబుల్ కెమెరా ధర రూ.5.999. ఫ్లామింగో పింక్, లైమ్ గ్రీన్, కోబాల్ట్ బ్లూ,
స్మోకీ వైట్, ఐస్ బ్లూ వంటి 5 ప్రత్యేకమైన ట్రెండీ కలర్స్‌లో ఈ కెమెరాలను అందుబాటులో ఉంచారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ఫీ మిర్రర్ ప్రధాన హైలైట్‌

Instax Mini 9 కెమెరాకు సెల్ఫీ మిర్రర్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలను మంచి వూవింగ్ యాంగిల్స్ లో క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది. క్లోజ్-అప్ లెన్స్‌తో ఎక్విప్ కాబడిన ఈ కెమెరాలో ఆటోమెటిక్ ఎక్స్‌పోజర్ మెజర్‌మెంట్, హై-కీ మోడ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

కెమెరా స్పెసిఫికేషన్స్...

Instax Mini 9 కెమెరాలో 0.37x target sportతో కూడిన వ్యూఫైండర్‌ ఉంటుంది. కెమరా షట్టర్ స్పీడ్ వచ్చేసరికి 1/60 second. 0.6 మీటర్ల నుంచి 2.7 మీటర్ల రేంజ్ మధ్య కెమెరా ఫ్లాష్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. రెండు AA సైజ్ 1.5V alkaline రీఛార్జబుల్ బ్యాటరీల పై కెమెరా రన్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ పై 100 ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు.

ఇన్‌బిల్ట్‌ cartridge..

Instax Mini 9 కెమెరాలో ఇన్‌బిల్ట్‌గానే Fujifilm Instax Mini film cartridgeను లోడై ఉంటుంది. ఈ క్యాట్రిడ్జ్ నుంచి ప్రింట్ అయ్యే ఫోటో సైజ్ 62mm x 46mmగా ఉంటుంది.

అమెజాన్‌లో దొరుకుతున్నాయి..

ఇప్పటికే Fujifilm ఇన్స్‌టాక్స్ మినీ సిరీస్ నుంచి మీనీ 25, మినీ 70, మినీ 90 మినీ 300, మినీ హల్లో కిట్టీ మోడల్స్‌లో కెమెరాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fujifilm Instax Mini 9 instant camera launched in India for Rs 5,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting