ఇండియలో ఇరగదీసేందుకు!!

Posted By: Prashanth

ఇండియలో ఇరగదీసేందుకు!!

 

ఫోటో కెమెరాల తయారీ సంస్థ ఫుజిఫిల్మ్ కొత్తశ్రేణి లోబడ్జెట్ డిజిటల్ కెమెరాలను భారత్‌లో విడుదల చేసింది. పేరు ఫుజిఫిల్మ్ JZ100. ముందుగా డివైజ్‌లోని ఫీచర్లను పరిశీలిద్దాం.... 129 గ్రాముల బరువు, 13.8 మెగా పిక్సల్ సీసీడి సెన్సార్, 2.7″ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 పిక్సల్ హై డెఫినిషన్ మూవీ షూట్, 8xజూమ్, 8x ఆప్టికల్ జూమ్ లెన్స్, బుల్ట్-ఇన్ ఫ్లాష్, షూటంగ్ రేట్ (1.2 fps), కాంట్రాస్ట్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్, హై డెఫినిషన్ మూవీ రికార్డింగ్(720p @ 30fps), ఐఎస్‌వో (100 – 3200*3), ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆరు కలర్ వేరియంట్స్, కెమెరా మెమరీని పెంచుకునేందుకు SDXC / SDHC / SD కార్డ్ స్లాట్స్, ఎస్‌ఆర్ ఆటో‌మోడ్, 26ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ధర 9,000.

ఈ కెమెరా ద్వారా యూజర్లు మెరుగైన ఫొటోగ్రఫీని ఆస్వాదిస్తారు. కెమెరా స్లిమ్ శరీరాకృతి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కెమెరాలో దాగి ఉన్న ఆధునిక ఫీచర్ మోషన్ పానోరమా హై క్వాలిటీ షూటింగ్‌కు సహకరిస్తుంది. 8x ఆప్టికల్ జూమ్‌లెన్స్ సుదూర చిత్రాలను సైతం క్లారిటతో షూట్ చేస్తుంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఈ సౌలభ్యతతో యూజర్ చిత్రీకరించిన ఫోటోలతో పాటు వీడియోలను షేర్ చేసుకోవచ్చు.

కెమెరాలోని మరో ఫీచర్ సీన్ రికగ్నిషన్ ఆటోమోడ్ టెక్నాలజీ సాయంతో గ్రూప్ ఫోటోలను ఉత్తమ క్వాలిటీతో షూట్ చేసుకోవచ్చు. పొందుపరిచిన ఐఎస్‌వో 3200 వ్యవస్థ తక్కువ వెలుతురులో సైతం ఫోటోలను సహజమైన వాస్తవికతతో తీర్చిదిద్దుతుంది. సిల్వర్, బ్లూ, బ్లాక్, పింక్, రెడ్, పర్పిల్ కలర్ వేరియంట్‌లలో ఫుజిఫిల్మ్ JZ100ను సొంతం చేసుకోవచ్చు. ధర రూ.9,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot