ముంబయ్ బ్యాక్‌డ్రాప్‌తో..?

ఇటీవల ముంబయ్‌లో నిర్వహించిన ఫోటో ఫెయిర్ ఎగ్జిబిషన్ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ప్రదర్శనలో భాగంగా ఫుజీఫిల్మ్ ఇండియా ఎక్స్ సిరీస్ నుంచి ఎస్1 నమూనాలో ప్రీమియమ్ క్వాలిటీ కెమెరాను లాంఛ్ చేసింది. ఎక్స్ సిరీస్ నుంచి మూడవ మోడల్‌గా వస్తున్న ఎస్1 కెమెరా ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉంటుంది.
ఫుజీఫిల్మ్ ‘X-S1’కీలక ఫీచర్లు:
* 12 మెగాపిక్సల్ EXR-CMOS సెన్సార్,
* ఖచ్చితమైన 26ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,
* మ్యాక్రో మోడ్,
* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,
* హై స్పీడ్ షూటింగ్ ఫంక్షన్,
నలుపు రంగు శరీరాక్ళతితో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ డిఎస్‌ఎల్ఆర్ తరహా కెమెరా స్టాండర్డ్ క్వాలిటీ ఫొటోగ్రఫీ అనుభూతిని కలిగిస్తుంది. ఈ డివైజ్ ద్వారా హై డెఫినిషన్ వీడియోలను స్టీరియో సౌండ్ సౌలభ్యతతో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాలో నిక్షిప్తం చేసిన ‘అల్ర్టా ఎఫీషియంట్ ఇమేజ్ సెన్సార్’, ‘ఫుజీనోన్ 26x ఆప్టికల్ లెన్స్’ వ్యవస్థలు ఉన్నతమైన జూమ్ సామర్ధ్యాన్ని విడుదల చేస్తాయి. లోడ్ చేసిన సూపర్ మ్యాక్రో మోడ్ అప్లికేషన్ ద్వారా క్లోజ్‌అప్ షాట్‌లను మన్నికతో చిత్రీకరించవచ్చు.


Click it and Unblock the Notifications








