తెరపైకి కొత్త పేరు..?

Posted By: Super

తెరపైకి కొత్త పేరు..?

 

ఫోటో కెమెరాల  తయారీ సంస్ధ ఫుజి‌ఫిల్మ్,  ఫైన్‌పిక్స్ JZ100 వేరియంట్‌లో కొత్త శ్రేణి డిజిటల్ కెమెరాను లాంఛ్ చేసింది. ఈ కెమెరా ఏర్పాటు చేసిన సుదీర్ఘ జూమ్ లక్షణం (Long Zoom feature) ముందెన్నడు ఎరగని ఫోటోగ్రఫీ అనుభూతులకు లోను చేస్తుంది. ఈ డివైజ్‌లో ఒదిగి ఉన్న ఉత్తమ లక్షణాలు మిమ్మల్ని ప్రొఫెష్‌నల్ ఫోటోగ్రాఫర్‌గా మార్చేస్తాయి.  హై క్వాలిటీతో కూడిన క్లోసప్ షాట్‌లను కెమెరా చిత్రీకరిస్తుంది.

ముఖ్య ఫీచర్లు:

-   అమర్చిన 14 మెగాపిక్సల్ లెన్స్ క్రిస్టల్ క్లియర్ ఫోటోలను విడుదల చేస్తాయి.

-   సులభమైన షూటింగ్ ఇంకా ప్లేబ్యాక్ కోసం  మోషన్ పానోరమా వ్యవస్థను కెమెరాలో నిక్షిప్తం చేశారు.

-   360 డిగ్రీ టర్న్ షూట్,

-   ఫోటో గుర్తింపు కోసం ఆటోమోడ్ టెక్నాలజీ నిక్షిప్తం,

-   720 పిక్సల్ హైడెఫినిషన్,

-   సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ఫోటోలను షేర్ చేసుకునే సౌలభ్యత,

-   స్లీక్ డిజైన్,

బ్లాక్, సిల్వర్, పింక్, బ్లూ, రెడ్ , పర్పిల్ కలర్ వేరింయంట్‌లలో  ఫైన్‌పిక్స్ JZ100 లభ్యమవుతోంది.  ఇండియన్ మార్కెట్లో విలువ రూ.8,499.

ఫుజిఫిల్మ్ ఫైన్‌పిక్స్ AX550:

ప్రఖ్యాత కెమెరాల తయారీ కంపెనీ ఫుజిఫిల్మ్ తన ఫైన్‌పిక్స్ లైనప్ నుంచి మరో కెమెరాను తీసుకొచ్చింది. ఈ కొత్త కెమెరా పేరు ఫుజిఫిల్మ్ ఫైన్‌పిక్స్ AX550. ఈ సింపుల్ పాయింట్ కెమెరాలో పలు ఉపయుక్తమైన ఫీచర్లను లోడ్ చేశారు. కెమెరాలో నిక్షిప్తం చేసిన 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ సీసీడి ఇమేజ్ సెన్సార్ ఉత్తమ క్వాలిటీ పోటోగ్రఫీనందిస్తుంది. ఏర్పాటు చేసిన 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ వ్యవస్థ సుదూర చిత్రాలను మన్నికతో క్యాప్చుర్ చేస్తుంది.

వెనక భాగంలో అమర్చిన 2.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫోటో కోణాన్ని స్పష్టం చేస్తుంది. 720 పిక్సల్ రిసల్యూషన్‌లతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇంటిగ్రేటెడ్ ఫ్లాష్ మరియు ఆటోమెటిక్ సీన్ రికగ్నిషన్ వ్యవస్థలు కెమెరా పనితీరును మరింత బలోపేతం చేస్తాయి. డ్యూయల్ కలర్ వేరియంట్‌లో ఈ కెమెరా డిజైన్ కాబడింది. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot