టార్గెట్ వెయ్యి కోట్లు...!

Posted By: Super

టార్గెట్ వెయ్యి కోట్లు...!

 

ఫోటో కెమెరాల తయారీ కంపెనీ ఫుజిఫిల్మ్‌ రానున్న మూడు సంవత్సరాలలో రూ 1000 కోట్ల రెవెన్యూను అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్ ను చేరుకునేందుకు చిన్న పట్టణాలపై దృష్టి సారించనున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి టనక తెలిపారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌ రూ.500 కోట్లతో ముగిస్తుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. భారత డిజిటల్‌ కెమెరాల మార్కెట్లో తమకు 7.1 శాతం వాటా ఉందని ఆయన చెప్పారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 శాతం మార్కెట్‌ వాటా సాధించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రానున్న మూడేళ్లలో దేశంలో మొత్తంగా 40 లక్షల యూనిట్ల కెమారాలు అమ్మకాలు అవుతాయని, ఇందులో 15 శాతం వాటా దక్కించుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్లు కెనిచి తెలిపారు. పూజిఫిల్మ్‌ ఇటీవల రూ.99,999 విలువ చేసే ఎక్స్‌ ప్రొల్‌ కెమరాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్స్‌-ఎస్‌1, జెజడ్‌, టి 350 మోడల్‌ కెమరాలను దేశీయా మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot