ఆ ఫోటో పై ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారం!

Posted By: Prashanth

ఆ ఫోటో పై ఇంటర్నెట్‌లో జోరుగా ప్రచారం!

 

సెప్టంబర్ 8న జర్మనీలో నిర్వహించనున్న ఫోటోకైనా (Photokina) సదస్సు పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకున్నాయి. ఈ ప్రదర్శనకు సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో ఫూజీఫిల్మ్‌కు చెందిన 2 రెట్రో‌స్టైల్ కెమెరాలతో ఉన్న ఓ ఫోటోగ్రాఫ్‌ ఇంటర్నెట్‌లో దర్శనమివ్వటం ఆసక్తికరంగా మారింది.

చిత్రంలో కినిపిస్తున్న కెమెరాలలో ఒక మోడల్‌ను ఫూజీ‌ఫిల్మ్ X-E1గా నిపుణులు భావిస్తున్నారు. ఈ చిత్రాలను ప్రముఖ జపనీస్ వెబ్‌సైట్ డిజిటల్ ఇన్ఫో (digital info) బహిర్గతం చేసింది. ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ వ్యవస్థను ఒదిగి ఉన్న ఈ మిర్రర్‌లెస్ కెమెరా X-Pro1 మోడల్‌కు దగ్గర పోలికలను కలిగి ఉంది. కెమెరాలో పాప్-అప్ ఫ్లాష్ ఫీచర్‌ను ఏర్పాటు చేసినప్పటికి ఆప్టికల్ వ్యూఫైండర్ వ్యవస్థ లోపించింది. స్మూత్ లెదర్ బాడీ కెమెరా స్టైల్‌ను మరింత రెట్టింపు చేసింది.

ఫోటోలో కనిపిస్తున్న మరో కెమెరా మోడల్ XP1 లేదా XF1 అయిఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కెమెరాలో ఇంటర్ ఛేంజబుల్ లెన్స్ వ్యవస్థ లోపించింది. అయితే, లెదర్ కవరింగ్ డివైజ్ అందాన్ని మరింత పెంచింది. ఈ కెమెరా 4ఎక్స్ జూమ్ అదేవిధంగా ఎఫ్/1.8ఎపర్చరు సమర్ధతను కలిగి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఫూజీఫిల్మ్ ఈ రెట్రో మోడల్ కెమెరాలను ఫోటోకైనా ప్రదర్శనలో ఆవిష్కరిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot