ఫుజిఫిల్మ్ వాటర్ ప్రూఫ్ ఫైన్‌పిక్స్ కెమెరా!!!

Posted By: Prashanth

ఫుజిఫిల్మ్ వాటర్ ప్రూఫ్ ఫైన్‌పిక్స్ కెమెరా!!!

 

ప్రకృతి రసరమ్యతను ఆస్వాదించే క్రమంలో పలువురు ఔత్సాహికులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి విపత్కర ప్రాంతాల్లో విహరించేందుకు మక్కువచూపుతారు. ఎండా.. వాన.. చలి తదితర ప్రతికూల వాతవరణాలను ఏ మాత్రం లెక్క చేయని వీరు క్రూరమైన అడువుల్లో ట్రెక్కింగ్ చేస్తూ దట్టమైన కొండల్లో ఒదిగి ఉన్న ప్రకృతి సోయగాలను తమ కెమెరాలలో బంధిస్తుంటారు.

ఇటువంటి వారి కోసం ‘ఫుజిఫిల్మ్’ జలనిరోధిత (వాటర్ ప్రూఫ్) కెమెరాను డిజైన్ చేసింది. ‘ఫైన్‌పిక్స్ XP150’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ కెమెరా తేమ ఇతర ప్రతికూల వాతవరణాల్లో సమర్ధవంతంగా పనిచేస్తుంది. దుమ్ము ఇతర ధూళి కణాలు ఈ డివైజ్‌కు ఏ విధమైన హాని తలపెట్టుకుండా ప్రధాన భాగాలకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జల ప్రాంతాల్లో కెమెరా జూమ్ లెన్స్ ఏ మాత్రం దెబ్బతినకుండా నీటిని నివారించే పదార్ధాన్ని లెన్స్ పై పూత పూశారు.

కెమెరా ప్రధాన ఫీచర్లు:

* ఎలక్ట్రానికి కాంపాస్, ఫోటో నేవిగేషన్, * ఫోటో సరైన స్థానాన్ని గుర్తించేందుకు సున్నితమైన జీపీఎస్ యాంటినా వ్యవస్ధను ఇన్‌బుల్ట్ చేశారు, * రబ్బరైజిడ్ కోటింగ్, మెటల్ హ్యాండ్ గ్రిప్, * పటిష్టమైన బ్యాకప్ నిచ్చే NP-50A రీఛార్జబుల్ బ్యాటరీ వ్యవస్థ, * ధర సంబంధిత వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot