ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

Posted By: Staff

ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

 

ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ తొలి అడుగులను  సరికొత్త ఫుజి‌ఫిల్మ్ ఫైన్‌పిక్స్ సీ25 డిజిటల్ కెమెరాతో మొదలుపెట్టండి. కమెరాల నిర్మాణ రంగంలో గత కొంత కాలంగా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న ఫుజి‌ఫిల్మ్ కాలానుగుణంగా ఫోటోగ్రఫీ డివైజ్‌లను డిజైన్ చేస్తుంది. ఫైన్‌పిక్స్ సిరీస్ నుంచి రాబోతున్న ఈ డివైజ్ వినియోగదారు కలలను సాకారం చేస్తుంది.

ఫీచర్లు:

12 మెగా పిక్సల్ సీసీడి సెన్సార్,

3ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్,

2.4 అంగుళాల ఎల్‌సీడి డిస్‌ప్లే మానిటర్,

హై డెఫినిషన్ క్వాలిటీ వీడియో రికార్డింగ్,

ఆటోమెటిక్ సీన్ డిటెక్షన్,

డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్,

యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

వైట్ బాలన్సింగ్,

స్మైల్ మరియు షూట్ డిటెక్షన్,

బుల్ట్ ఇన్ ఫ్లాష్.

ఈ విధమైన అత్యాధునిక ఫీచర్లతో సమంజసమైన ధరకే  కెమెరా లభ్యం కానుంది. ఈ డివైజ్ వినియోగంతో శ్రోత  ప్రొఫెషనల్  క్వాలిటీ ఫోటోలతో పాటు వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. సంవత్సరం వారంటీతో లభ్యం కానున్న ఈ కెమెరా బరువు కేవలం 368గ్రాములు. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలనలోకి తీసుకుని ఈ కెమెరాను ఆకర్షణీయమైన శైలిలో డిజైన్ చేశారు. మెమరీని పెంచుకునేందకు SD/SDHC మెమరీ కార్డులను ఉపయోగించుకోవచ్చు. బుల్ట్ ఇన్ ఫ్లాష్ మరియు సెల్ఫ్ టైమర్ వ్యవస్థలను ఈ లో బడ్జెట్ కెమెరాలో నిక్షిప్తం చెయ్యటం విశేషం. ధర ఇతర విడుదల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot