ఫుజి ఆవిష్కరణ.. ‘మిర్రర్ లెస్ కెమెరా’!!!

Posted By: Prashanth

ఫుజి ఆవిష్కరణ.. ‘మిర్రర్ లెస్ కెమెరా’!!!

 

మన్నికైన కెమెరాలను ఉత్పత్తి చేయ్యటంలో ఉత్తమ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఫుజీ(Fuji) విప్లవాత్మక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ బ్రాండ్ తాజాగా ‘స్వీయ పరస్పర మార్పిడి లెన్స్ కెమెరా’ను ( own interchangeable lens camera) డిజైన్ చేసింది.

ఫుజికి ప్రధాన పోటీదారులైన నికాన్ (Nikon), కానోన్ ( Canon)లు ఇప్పటికే ఈ తరహా కెమెరాను డిజైన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. విడుదల కాబోతున్న ఇతర మోడల్స్‌తో పోలిస్తే తామ రూపొందించిన ‘మిర్రర్ లెస్ కెమెరా’ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని ఫుజీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ డివైజ్‌కు సంబంధించి పలు చిత్రాలను నెట్‌లో విడుదల చేశారు. ఈ కెమెరా టైటిల్‌ను ‘క్లిక్స్ X1’ లేదా ‘క్లిక్స్ LX10’గా ఖరారు చేసే అవకాశముందని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి ప్రధమాకంలో ఈ మిర్రర్ లెస్ కెమెరా అందుబాటులోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఫుజి మిర్రర్ లెస్ కెమెరా ఫ్రధాన ఫీచర్లు:

* రెట్రో రేంజ్ఫైండర్ శైలీకృత డిజైన్ (Retro rangefinder stylized design),

* ఈ కెమెరా వాతావరణానికి అనుగుణంగా తనంతట తానే లెన్స్‌ను మార్చుకుంటుంది,

* ఫోట్రో గ్రాఫర్‌లకు అత్యంత ప్రియమైన 35mm f/ 1.4 లెన్స్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది,

* ఏర్పాటు చేసిన లైట్ వ్యవస్థ నాణ్యమైన వీడియో షూటింగ్ కోసం సహాయం చేస్తుంది,

* ధర ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చే వారం జరిగే పీఎమ్ఏ వేడుకలో తెలుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot